Minister Viswarup: మంత్రి విశ్వరూప్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.. వైఎస్సార్ వర్థంతి వేడుకలో..

అంబేద్కర్‌ జిల్లా అమలాపురం పర్యటనలో ఉండగా.. విశ్వరూప్‌‌కు ఛాతీలో నొప్పి రావడంతో కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, నాయకులు

Minister Viswarup: మంత్రి విశ్వరూప్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.. వైఎస్సార్ వర్థంతి వేడుకలో..
Minister Viswarup

Updated on: Sep 02, 2022 | 4:42 PM

Minister Pinipe Viswarup: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం అంబేద్కర్‌ జిల్లా అమలాపురం పర్యటనలో ఉండగా.. విశ్వరూప్‌‌కు ఛాతీలో నొప్పి రావడంతో కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు మంత్రి విశ్వరూప్‌ను హుటాహుటిన అమలాపురంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం.. అక్కడి నుంచి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు ప్రకటించారు. అమలాపురంలో వైఎస్‌ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా.. మంత్రి పినిపే విశ్వరూప్‌ అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలుసుకున్న ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం