YSRCP: ‘హైదరాబాద్‌తో పోటీపడేలా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం’: మంత్రి అమర్నాథ్

|

Dec 17, 2023 | 8:36 AM

వైసీపీ నేతల బృందం భోగాపురంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. మరో 30 నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్ర చేపట్టినప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మాటిచ్చారు. అధికారంలోకి రాగానే ఆదిశగా కార్యచరణ చేపట్టారు. రీసెంట్‌గా కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ హాస్పిటల్‌, రీసెర్చ్‌ సెంటర్‌ సహా సేఫ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

YSRCP: హైదరాబాద్‌తో పోటీపడేలా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం: మంత్రి అమర్నాథ్
Minister Amarnath
Follow us on

వైసీపీ నేతల బృందం భోగాపురంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. మరో 30 నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్ర చేపట్టినప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మాటిచ్చారు. అధికారంలోకి రాగానే ఆదిశగా కార్యచరణ చేపట్టారు. రీసెంట్‌గా కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ హాస్పిటల్‌, రీసెర్చ్‌ సెంటర్‌ సహా సేఫ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. పలాస వేదికగా విపక్షాల వైఖరిని ఘాటుగా విమర్శించారాయన. అలా ఉత్తరాంధ్ర అభివృద్ధి సహా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ గురించి సీఎం ప్రధానంగా ప్రస్తావించారు. ఈక్రమంలోనే సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందన్నారు వైవీ సుబ్బారెడ్డి.

అమరావతి కోసం టీడీపీ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసిందన్నారు . ఇచ్చిన మాట ప్రకారం ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ కట్టుబడి వుందని తెలిపారు. 30 నెలల్లో ఎయిర్‌పోర్ట్‌ పనులు పూర్తయ్యేలా సీఎం జగన్‌ చర్యలు చేపట్టారన్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు వైసీపీ నేతలు. ఉత్తరాంధ్ర అభివృద్ది వైసీపీ లక్ష్యం అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. హైదరాబాద్‌తో పోటీపడేలా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారన్నారు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్‌నాథ్‌. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే సీఎం జగన్‌ అభిమతమన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..