AP Politics: వారు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు.. మీరు ఎందుకు గెలువలేదో చెప్పండి.. పవన్‌ కామెంట్స్‌కు మంత్రి అమర్‌నాథ్‌ కౌంటర్

వారాహి రెండో విడత విజయయాత్రలో.. తొలిరోజు వైసీపీ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు. అప్పుల నుంచి ఉమెన్‌ ట్రాఫికింగ్‌ దాకా.. తీవ్ర ఆరోపణలే గుప్పించారు. అయితే, వాటికి అదే స్థాయిలో అధికార పక్షం నుంచి కౌంటర్లు పడుతున్నాయ్‌. పాయింట్‌ టు పాయింట్‌.. జనసేన అధినేతకు స్ట్రాంగ్‌ కౌంటర్లిచ్చారు మంత్రి అమర్‌నాథ్‌.

AP Politics: వారు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు.. మీరు ఎందుకు గెలువలేదో చెప్పండి.. పవన్‌ కామెంట్స్‌కు మంత్రి అమర్‌నాథ్‌ కౌంటర్
Minister Amarnath

Updated on: Jul 10, 2023 | 1:25 PM

విశాఖపట్నం, జూలై 10: వారాహి రెండో విడత విజయయాత్రలో.. తొలిరోజు వైసీపీ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై  పరిశ్రమల శాఖా మంత్రి అమర్‌నాథ్‌  విరుచుకుపడ్డారు. అప్పుల నుంచి ఉమెన్‌ ట్రాఫికింగ్‌ దాకా.. తీవ్ర ఆరోపణలే గుప్పించారు. అయితే, వాటికి అదే స్థాయిలో అధికార పక్షం నుంచి కౌంటర్లు పడుతున్నాయి. పాయింట్‌ టు పాయింట్‌.. జనసేన అధినేతకు స్ట్రాంగ్‌ కౌంటర్లిచ్చారు మంత్రి అమర్‌నాథ్‌. సినిమా పరిశ్రమలో చాలామంది కమెడియన్లు, కారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయినా పవన్ కనీసం ఎమ్మెల్యే గా ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు.

రాజకీయ అవసరాలకు తల్లి, రాజకీయాల కోసం భార్య పేరు ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఆంధ్రాకు వచ్చి గంజాయి తాగుతూ నోటికి వచ్చినట్లు వాగుతున్నాడని విరుచుకుపడ్డారు. అద్భుతమైన సేవలు అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ పై విషం చిమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం నీకు, నీ పార్టనర్ చంద్రబాబు కు ఉందా? అంటూ సవాల్ విసిరారు.

టీడీపీలో జనసేనను విలీనం చేస్తే ప్యాకేజీ రాదని, వేర్వేరు బ్యానర్లు పెట్టుకుని దందా చేస్తున్నారని మండిపడ్డారు. 2024 తర్వాత డిక్కీ బలిసిన కోడి వచ్చి చికెన్ షాప్ ముందు కూసిన చందంగా పవన్ పరిస్తితి తయారవుతుందన్నారు. వారాహి పార్ట్‌ 2లో భాగంగా పొలిటికల్‌ సైడ్‌ హీరో రాజకీయాలు మాట్లాడుతున్నారని.. సంసారం గురించి ఓ తిరుగుబోతు మాట్లాడినట్లు పవన్‌ కల్యాణ్ మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.

గ్రామాల్లో పవన్ కల్యాణ్ తిరుగుతంటే చూసి అమ్మాయిలు భయపడుతున్నారని.. మీకు ధైర్యం ఉంటే అమ్మ ఒడి, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తున్నట్టు చెప్పగలరా అని మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు.