Earthquake: గుంటూరు జిల్లాలో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

|

Mar 31, 2022 | 11:36 PM

Earthquake in Guntur District: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో భూకంపం సంభవించింది. రాత్రి పది గంటల ప్రాంతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.

Earthquake: గుంటూరు జిల్లాలో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Earthquake
Follow us on

Earthquake in Guntur District: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో భూకంపం సంభవించింది. రాత్రి పది గంటల ప్రాంతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని శ్యావల్యపురం, నూజెండ్ల మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. శావల్యాపురం మండలం బొందిలిపాలెం, మతుకుమల్లి.. నూజెండ్ల మండలం ములకలూరులో భూమి కంపించింది. 2 నుంచి 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగుల తీశారు. నిద్ర పోయే సమయంలో భూమి కంపించడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆందోళన నెలకొంది.

ఇదిలాఉంటే.. గతంలో ఏపీలోని గుంటూరు జిల్లాతోపాటు పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా భూమి కంపించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

Also Read:

Andhra Pradesh: పశువులకూ సరోగసీ.. మన ఏపీలోనే.. మేలుజాతి ఆంబోతుల వీర్యాన్ని సేకరించి..

Nallamala Forest: నల్లమలలో మరో చిరుత మృతి.. పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన..