Andhra Pradesh: వద్దని వారించినా వినలేదు.. తమ్ముడి క్రాస్ ఓటింగ్‌పై స్పందించిన రాజమోహన్ రెడ్డి

2019 వరకు చంద్రశేఖర్ రెడ్డి బాగానే ఉన్నాడని, కానీ కొంతకాలంగా ఆయన పంచన ఓ దుష్టశక్తి చేరిందని ఆయనతో నీచాతి నీచమైన దరిద్రపు పనులన్నీ చేయిస్తోందని రాజమోహన్ రెడ్డి అన్నారు. చేసిన దుర్మార్గపు పనికి గాను ఇవాళ అతడు ఒంటరివాడు అయిపోయాడని చెప్పారు.

Andhra Pradesh: వద్దని వారించినా వినలేదు.. తమ్ముడి క్రాస్ ఓటింగ్‌పై స్పందించిన రాజమోహన్ రెడ్డి
Mekapati Rajamohan Reddy

Updated on: Apr 07, 2023 | 9:14 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. MLCఎన్నికల్లో తన తమ్ముడు క్రాస్ ఓట్ చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. తనకు ముందుగా సమాచారం తెలిసి.., ఆయన అనుచరులు ద్వారా వారించేందుకు ప్రయత్నించినా వినలేదన్నారు. అంతేకాదు మూడేళ్ళుగా ఆయనతో మాట్లాడటం లేదన్నారు. ఒక దుష్టశక్తి ఆయన జీవితంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. ఆయన సరిగ్గా ఉంటే సీటు ఇవ్వకపోయినా.. ఎమ్మెల్సీ పోస్ట్ లేదా ఇంకేదైనా పదవి ఇచ్చేవారన్నారు. తప్పు చేసినవారిని పార్టీ క్రమశిక్షణ ప్రకారమే సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చారు.

కొత్తగా వచ్చేవారిని మచ్చిక చేసుకునేందుకే టీడీపీ వారు ఈ నాటకాలు ఆడుతున్నారన్న రాజమోహన్‌రెడ్డి…తమ కుటుంబం తరపున పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తామని.. ముగ్గురు MLAలు పార్టీని వీడినా నష్టం లేదన్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..