
ప్రకృతిలో అనేక విచిత్రమైన జీవులు ఉన్నాయి. వాటిలో షణ్ముఖ కాకి ఒకటి. దీనికి జెముడు కాకి, సాంబార్ కాకి, చమరకాకి అని రకరకాల పేర్లో పిలుస్తారు. ఇది ఎక్కువ దూరం ఎగరలేదు. ఈ పక్షి పాములను వేటాడంటో చాలా ఎక్స్‌పర్ట్. ఒకసారి ఈ కాకి కంట ఒక పాము పడిందంటే, అది ఎంత సమయమైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఆ పామును చంపి తినేదాకా వదిలిపెట్టదు. షణ్ముఖ కాకి వేటలో అసాధారణమైన పట్టుదలను ప్రదర్శిస్తుంది. గంటసేపు కాదు, అవసరమైతే నాలుగు గంటలైనా సరే, తన లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడుతుంది. అది చిన్న పాము కావచ్చు, పెద్ద పాము కావచ్చు, అత్యంత విషపూరితమైన పాము కావచ్చు లేదా నీటి పాము కావచ్చు. ఏ రకమైన పామునైనా సరే, ఒక్కసారి దాని కంట పడితే, దాని ప్రాణాలు దక్కించుకోవడం అసాధ్యం. షణ్ముఖ కాకి తన నైపుణ్యంతో, పట్టుదలతో పాములను వేటాడి, ఆహారంగా చేసుకుంటుంది. ఇది దాని ఆహారపు అలవాట్లలో ఒక కీలకమైన లక్షణం. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అది తాచుపామును తన ఆహారంగా మలుచుకుంది. తాచుపాము తలను అటాక్ చేసి.. దాన్ని చంపింది. ఈ వీడియోకు నెట్టింట ఓ రేంజ్ లైక్స్ వస్తున్నాయి. అయితే ఈ పక్షలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం అరుదుగా మారింది. వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.