Anantapur district: విదేశీయుడికి తెలుగువారి మంచి మనసు చాటి చెప్పిన ఆటోడ్రైవర్..

అవకాశం దొరికితే అందినకాడికి దొచుకుంటున్న ఈ రోజుల్లో ఓ విదేశీయుడు పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను తిరిగి అతనికి అందజేసి నిజాయితీ నిరూపించుకున్నాడు అనంతపురం జిల్లాలో ఓ డ్రైవర్‌.

Anantapur district: విదేశీయుడికి తెలుగువారి మంచి మనసు చాటి చెప్పిన ఆటోడ్రైవర్..
Auto Driver Honesty
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 03, 2022 | 5:28 PM

Auto Driver Honesty: ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. తన వాహనంలో మరిచిపోయిన విలువైన సెల్‌ఫోన్‌ను యజమానులకు అప్పగించి ప్రశంసలు పొందాడు. అవకాశం దొరికితే అందినకాడికి దొచుకుంటున్న ఈ రోజుల్లో ఓ విదేశీయుడు పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను తిరిగి అతనికి అందజేసి నిజాయితీ నిరూపించుకున్నాడు అనంతపురం జిల్లాలో ఓ డ్రైవర్‌. జిల్లాలోని పుట్టపర్తి(Puttaparthi)కి చెందిన శ్రీనివాసులు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రష్యా(Russia)కు చెందిన ఓ వ్యక్తి ప్రశాంతి నిలయం వద్ద శ్రీనివాసులు ఆటో ఎక్కి గోకులం వరకు వెళ్లాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌ ఆటోలో మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి సమయం కావడంతో ఆటోతో పాటు ఇంటికి వెళ్లాడు శ్రీనివాస్‌. అప్పుడే ఆటోలో ఉన్న సెల్‌ఫోన్‌ను గుర్తించి విదేశీయుడి ఫోన్‌ అయి ఉంటుందని భావించాడు. చీకటి కావడంతో ఆ రాత్రి తన వద్దనే సెల్‌ఫోన్‌ ఉంచుకున్నాడు. ఆ మర్నాడు ఉదయాన్నే ఆ విదేశీయుని ఆచూకీ కోసం గాలించి, అతని అడ్రస్‌ కనుక్కున్నాడు. ఇంటికెళ్లి అతనికి సెల్‌ఫోన్‌ అందజేశాడు.

ఆటోడ్రైవర్‌ నిజాయితీని ఫారెనర్ ప్రశంసించారు. తన సెల్‌ఫోన్‌లో ఎంతో విలువైన డేటా ఉందని, ఫోన్‌ తిరిగి అందించినందుకు డ్రైవర్‌ శ్రీనివాసుల్ని అభినందించారు. విదేశయుల ముందు భారతీయుల, తెలుగువారి మంచి మనసు చాటిచెప్పిన అతడిని నెటిజన్లు పొగుడుతున్నారు.

Also Read: మాకేదీ వినిపించదు..మాటలు కూడా రావు..! నమ్మారో ఇక అంతే!!

తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. ఈరోజు నుంచే..