ఇంద్రకీలాద్రి పై ప్రమాదం.. రక్తపు మరకల పైనే భక్తుల “ప్రయాణం”

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటుచేసుకుంది. దసరా శరన్నవరాత్రుల కోసం చేస్తున్న ఏర్పాట్లలో ప్రమాదం జరిగింది. పాతరాజగోపురం పై షెడ్డు నిర్మిస్తుండగా ఓ వ్యక్తి అమాంతం కాలు జారి కిందపడిపోయాడు. కింద పడిన వెంటనే తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన జయ్‌దేవ్‌గా గుర్తించారు. రక్తపు మరకలు పడిన చోట శుభ్రం చేయకుండానే ఆలయ సిబ్బంది ఇసుక వేసి చేతులు దులుపుకున్నారు. దీంతో రక్తపు మరకలు తొక్కుకుంటూనే భక్తులు వెళుతున్నారు. కాగా, అధికారుల […]

ఇంద్రకీలాద్రి పై ప్రమాదం.. రక్తపు మరకల పైనే భక్తుల ప్రయాణం

Edited By:

Updated on: Sep 26, 2019 | 12:50 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటుచేసుకుంది. దసరా శరన్నవరాత్రుల కోసం చేస్తున్న ఏర్పాట్లలో ప్రమాదం జరిగింది. పాతరాజగోపురం పై షెడ్డు నిర్మిస్తుండగా ఓ వ్యక్తి అమాంతం కాలు జారి కిందపడిపోయాడు. కింద పడిన వెంటనే తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన జయ్‌దేవ్‌గా గుర్తించారు. రక్తపు మరకలు పడిన చోట శుభ్రం చేయకుండానే ఆలయ సిబ్బంది ఇసుక వేసి చేతులు దులుపుకున్నారు. దీంతో రక్తపు మరకలు తొక్కుకుంటూనే భక్తులు వెళుతున్నారు. కాగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.