AP: అయ్యో పాపం..అత్తింటివారు ఆ డిమాండ్ పెట్టారు.. దీంతో సెల్ టవర్ ఎక్కాడు..చివరకు

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. పోలీసులు, స్థానికుల్ని కాసేపు ఉరుకులు, పరుగులు పెట్టించాడు.

AP: అయ్యో పాపం..అత్తింటివారు ఆ డిమాండ్ పెట్టారు.. దీంతో సెల్ టవర్ ఎక్కాడు..చివరకు
Protest For Wife

Updated on: Dec 25, 2021 | 4:17 PM

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. పోలీసులు, స్థానికుల్ని కాసేపు ఉరుకులు, పరుగులు పెట్టించాడు.పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం అతన్ని కిందకు దింపేందుకు ప్రయత్నించారు..అతను ఎంతకు కిందకు దిగిరాలేదు.. దాదాపు రెండుగంటలకుపైగా హైడ్రామా నడిచింది. ఇంతకీ ఇతడు టవరెక్కిన కారణం ఏంటో తెలిస్తే..మీరు కూడా షాక్‌ అవుతారు.

జిల్లాలోని మదనపల్లె రాజీవ్‌నగర్‌కు చెందిన క్రాంతికుమార్‌కు కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రమీలతో 2019లో వివాహమైంది. వీరికి రెండేళ్ళ కుమార్తె ఉంది. కొద్దిరోజులుగా క్రాంతిని ఇల్లరికం రావాలని అత్త, బావమరిది ఒత్తిడి చేస్తున్నారు. ఇదే విషయమై తరచూ భార్య భర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది…ఇటీవల పుట్టింటికి వెళ్లిన క్రాంతి కుమార్‌ భార్య తిరిగి రాకపోవటంతో..తనను తీసుకొచ్చేందుకు క్రాంతి కుమార్‌ అత్తిగారి ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఇల్లరికం రమ్మని బావమరిది, అత్త అడిగారు. లేకపోతే అమ్మాయి కాపురానికి పంపించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దాంతో మనస్తాపానికి గురైన క్రాంతికుమార్ రాజీవ్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సెల్ టవర్ ఎక్కాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.. వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…బాధితుడి అత్తింటి వారితో మాట్లాడి సర్ది చెప్పారు. ఎట్టకేలకు క్రాంతి సెల్‌టవర్ నుంచి కిందకు దిగి రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్

ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత

Follow Us