
ఈద్ మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ పండుగ ఉండటంతో.. ఆ కుటుంబ సభ్యులు సరదాగా గడపాలని ఊరి చివరన ఉన్న తమ పొలానికి తెల్లవారుజామునే వెళ్లారు. అవసరమైన ఆహార పదార్థాలు తయారు చేసుకుని ఆనందంగా అక్కడికి వెళ్లిన కొన్ని గంట సమయంలోనే ఊహించని ఘటన జరిగింది. ఆ పొలంలో ఆటపాటలతో సరదాగా గడిపిన కుటుంబ సభ్యులు మధ్యాహ్నం వేళ భోజనానికి తమ పొలంలోని చెట్టు కిందిక కూర్చుని.. తమ వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను భుజించడానికి సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేశాయి. వారు తప్పించుకోవాలన్న ప్రయత్నాలు చేసినప్పుటికీ అవి విఫలమయ్యాయి. చిన్నపిల్లలైన తమ మనవళ్లను,మనవరాళ్లను కాపాడటం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారిని ప్రాణాలతో కాపాడి తనను కాపాడుకునే సమయంలో తేనెటీగల దాడిలో తీవ్ర గాయాలపాలై అస్వస్థతకు గురై ప్రాణాలు అతడు వదిలాడు. పండుగ రోజు సరదాగా గడపాలనుకున్న కుటుంబ సభ్యుల కళ ఒక్కాసారిగా విషాదం వైపు తీసుకెళ్లింది.
అయితే ఈ సంఘటన నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పండగ రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పొలంలో ఒక చెట్టు కింద మధ్యాహ్న సమయంలో సేద తీరి భోజనానికి సిద్ధమవుతున్న వారిపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై అస్వస్థకు గురైన ఫక్రున్ భీ, మహబూబ్ బాషా, షఫీ అనే బాలుడ్ని హుటాహుటిన ఆటోలో డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫక్రున్ భీ ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. తీవ్ర గాయాల పాలై పరిస్థితి విషమంగా ఉన్న బాలుడిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పండుగ రోజే ఈ విషాద సంఘటన జరగడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటంబానికి ఇలా జరగడాన్ని చూసి బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..