వార్నీ.. ఈ భీమవరం బుల్లోడికి కోపం వస్తే.. పోలీసులు, ఫైర్‌సిబ్బందికి చెమటలు పట్టాల్సిందే..!

| Edited By: Jyothi Gadda

Nov 28, 2024 | 4:22 PM

ఇక్కడ ఓ భీమవరం బుల్లొడు ఉన్నాడు.. అతడికి కోపం వచ్చిందంటే నా సామి రంగ ఇంకా పోలీసులకు కూడా జాగారమే. ఆయన కోపానికి పోలీసులకు సంబంధం ఏంటా అని సందేహ పడుతున్నారా..? అయితే, పూర్తి వివరాల్లోకి వెళితే..

వార్నీ.. ఈ భీమవరం బుల్లోడికి కోపం వస్తే..  పోలీసులు, ఫైర్‌సిబ్బందికి చెమటలు పట్టాల్సిందే..!
Man Climbs Towers
Follow us on

ఏలూరు: ఇంట్లో పిల్లలు చాక్లెట్ కావాలని, సినిమాకు తీసుకువెళ్లాలని తల్లిదండ్రులను అడుగుతారు. పేరెంట్స్ వద్దంటే కొందరు వింటారు. మరికొందరు ఏడ్చి గోల చేసి తమకు కావాల్సింది నెరవేర్చుకునే వరకు మారం చేసేవాళ్లు మరికొందరు ఉంటారు.  ఇంకొందరు అలుగుతారు. ఇలా అలక పాన్పు ఎక్కితే ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం, ఏమి తినకుండా బ్రతిమిలాడించుకోవటం చేస్తారు. ఇదంతా చిన్న పిల్లలు ఎక్కువగా చేసేది. కానీ, ఇక్కడ ఓ భీమవరం బుల్లొడు ఉన్నాడు.. అతడికి కోపం వచ్చిందంటే నా సామి రంగ ఇంకా పోలీసులకు కూడా జాగారమే. ఆయన కోపానికి పోలీసులకు సంబంధం ఏంటా అని సందేహ పడుతున్నారా..? అయితే, పూర్తి వివరాల్లోకి వెళితే..

భీమవరం కు చెందిన బిందెలు వసంతరావు అనే వ్యక్తికి కోపం వస్తే ఇంట్లోని కుటుంబ సభ్యులతో పాటుగా పోలీసులకు కూడా ముప్పుతిప్పలు తప్పవు.  ఈయన గారు తన డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి ఏకంగా సెల్ టవర్ ఎక్కుతుంటారు. ఒరేయ్ నువ్వు ఎక్కింది గోడ కాదు. ప్లీజ్  దిగేయరా నాయనా. అక్కడ నుంచి పడితే ప్రాణాలు పోతాయ్ ..నా బంగారం కదూ..నా బుజ్జి కదు. అంటూ పోలీసులు సైతం నానా పాట్లు పడి అతడిని బ్రతిమిలాడి ఎలాగోలా సెల్ టవర్ పై నుంచి కిందకు దింపుతారు. ఇలా ఒకటి రెండుసార్లు కాదు.. ఇప్పటి వరకు ఇతగాడు ఆరుసార్లు సెల్ టవర్ ఎక్కాడు. దీనికి బదులుగా ఏ ఎవరెస్ట్ఎ ఎక్కితే గిన్నీస్ బుక్ లో కైనా ఎక్కేవాడు అంటున్నారు స్థానికులు.  ఇలా తరచూ సెల్ టవర్ కావటంతో పోలీసులు, ఫైర్ సిబ్బందికి సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి అనగానే ఇక మనోడేలే అని అనుకునేంత గా భీమవరంలో ఫేమస్ అయ్యాడు వసంతరావు.

తాజాగా మరోసారి కరెంట్ పోల్ ఎక్కి హల్ చల్ చేశాడు వసంతరావు. ఫుల్లుగా మద్యం తాగటం సెల్ టవర్, కరెంట్ పోల్స్ ఎక్కేయటం…ఇతడికి నిత్యక్రృత్యం  అయిపోయింది. రిక్షా తొక్కుకుంటూ భీమవరంలో జీవించే ఇతగాడు. ఇప్పటి దాకా ఐదుసార్లు ఇలా ఏదోఒకటి ఎక్కేసి హడావుడి చేశాడు. ఇతడి బాధ భరించలేక సెల్ టవర్స్ చుట్టూ కంచె వేయించారు. అయినా వాటిలో దూరి మరి టవర్స్ ఎక్కేస్తాడు. ఇక ఆరోసారి విద్యుత్ పోల్ ఎక్కాడు. ఇలా సెల్ టవర్స్, కరెంట్ పోల్స్ ఎక్కడం వరుసగా ఆరోసారి కావటంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసుల సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తాగేసి రోడ్లపై వాగటం…ఎవరో ఏదో అన్నారని సెల్ టవర్ , కరెంట్ పోల్స్ ఎక్కేయటం సర్వసాధారణంగా మారిపోయింది. కరెంట్ పోల్ ఎక్కడంతో అతను దిగే వరకు విద్యుత్ సరఫరాను సైతం అధికారులు నిలిపి వేసారు. దీంతో కొన్ని గంటల పాటు సమీప నివాసితులు ఇబ్బంది పడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..