AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వాతావరణం ఎలా ఉంటుందంటే…?

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోనసీమ నుంచి కడప, తిరుపతి వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించింది.

AP - Telangana: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వాతావరణం ఎలా ఉంటుందంటే...?
Weather

Updated on: Nov 04, 2025 | 9:45 PM

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం (05-11-2025) కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గురువారం నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అకస్మాత్తుగా ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు బాపట్లలో 61.5మిమీ, నంద్యాల(జి) నందికొట్కూరులో 51.7మిమీ, బొల్లవరంలో 43.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

ఇక తెలంగాణలో నవంబర్ 6 వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌తో పాటు నిర్మల్ జిల్లాల్లో బుధ, గురువారాల్లో ప్రధానంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.