Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

|

Sep 02, 2024 | 4:41 PM

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది..

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
Rain Alert
Follow us on

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటన విడుదల చేసింది.. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతములో నున్న వాయుగుండం కేంద్రం గుండా, దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ, మచిలీపట్నంలో గుండా వెళుతూ  అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంటుంది… దీంతో షియర్ జోన్  లేదా గాలులకోత ఇప్పుడు ఉత్తర  భారతదేశ ద్వీపకల్పలో సగటు సముద్ర మట్టానికి  3.1, 5.8  కిలోమీటర్ల ఎత్తు  మధ్య  సుమారుగా  20°ఉత్తర అక్షాంశం  వెంబడి విస్తరించి ఉన్నది. అంతేకాకుండా.. పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వేరొక  అల్పపీడనం సెప్టెంబర్ 5, 2024  నాటికి ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాక పేర్కొంది.. రాబోవు  మూడు  రోజులకు వాతావరణ సూచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్  & యానాం:-

సోమవారం, మంగళవారం: తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల  కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన  ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము అనేకచోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి ఒక  మోస్తరు వర్షము  కొన్ని చోట్ల  కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల  వేగముతో వీచే అవకాశముంది.

బుధవారం తేలికపాటి నుండి ఒక  మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..