ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెరిపినిచ్చాయి. దీంతో కాస్త రిలీఫ్ కలిగినా.. మళ్లీ మరో అల్పపీడన గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఏఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఉందో.. ఇప్పుడు తెలుసుకుందామా..
గురువారం, సెప్టెంబర్ 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల ఏపీలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఓ గంటపాటూ భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత కూడా మోస్తరుగా కురుస్తాయి. ఇవాళ రాయలసీమలో మాత్రం వర్షాలు లేవు. అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
The Ongoing spell of rains in Ubhaya Godavari, Eluru, West Godavari seems reducing as per the latest radar image. The rains remained Moderate at many places while HEAVY near #Rajahmundry city and nearby places. Even parts of Krishna district getting some Light to Moderate rains…
— Andhra Pradesh Weatherman (@praneethweather) September 4, 2024
మరోవైపు తెలంగాణకు భారీ వర్ష సూచన అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ తెలంగాణ అంతటా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా కురుస్తాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రం భారీగా వర్షాలు కురిసే అవకాశముంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసిన అధికారులు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆల్రెడీ మంగళవారం రాత్రి నుంచి తెలంగాణలో వాన పడుతోంది. ఇక హైదరాబాద్‌లోనూ ఇవాళ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది.
HEAVY RAIN ALERT – SEP 4-9 2024 ⚠️
Due to fresh LPA again POWERFUL RAINS expected in PINK matked areas. Big trouble is that this is the same area which got devastated by massive floods, again one more heavy rainfall event is ready to strike (slightly less than previous one, but… pic.twitter.com/kqzZH8unET
— Telangana Weatherman (@balaji25_t) September 4, 2024