AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే చాన్స్.. ఏపీకి భారీ వర్షసూచన

|

Nov 19, 2022 | 3:10 PM

రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే చాన్స్.. ఏపీకి భారీ వర్షసూచన
Andhra Pradesh Weather Update
Follow us on

దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై రాగల 24 గంటల్లో వాయుగుండంగా కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత, తదుపరి 2 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఈశాన్య గాలులు వీస్తాయి. ఈ క్రమంలో ఏపీలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

ఈ రోజు, రేపు, ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈ రోజు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ :-

ఈ రోజు:  వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

రేపు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..