AP Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో…

|

Aug 18, 2021 | 3:54 PM

AP Weather Alert: అల్పపీడన ప్రాంత అనుబంధ ఉపరితల ఆవర్తనం నుండి ఏర్పడిన ఉత్తర, దక్షిణ ద్రోణి ఇప్పుడు.. ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్..

AP Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో...
Skymet Weather
Follow us on

AP Weather Alert: అల్పపీడన ప్రాంత అనుబంధ ఉపరితల ఆవర్తనం నుండి ఏర్పడిన ఉత్తర, దక్షిణ ద్రోణి ఇప్పుడు.. ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా విదర్భ నుండి ఉత్తర తమిళనాడు తీరం వరకు విస్తరించి ఉందని భారత, అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. ఈ ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రిపోర్ట్ విడుదల చేశారు.

ఈ రిపోర్ట్ ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ముఖ్యంగా ఇవాళ ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుందన్నారు. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే ఛాన్స్ ఉందన్నారు.

ఇక దక్షిణ కోస్తాంధ్రాలోనూ ఇదే రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పారు. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల పడే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ పరిధిలోని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలకు అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also read:

Hyderabad: గాంధీ ఆస్పత్రి రేప్‌ మిస్టరీ.. వీడని చిక్కుముడి.. ఘటనపై సర్కార్ సీరియస్

Sridevi Soda Center: సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా సుధీర్ బాబు ‘సోడాల శ్రీదేవి సెంటర్’ ట్రైలర్..

ఏపీలో ఉప్పొంగుతోన్న వాగులు, కొట్టుకుపోయిన వట్టిగెడ్డ కాజ్వే బ్రిడ్జి.. కట్టలేరుకు వరద ఉధృతి, తెగిన రాకపోకలు