Visakhapatnam: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. చివరకు పురుగుల మందు తాగి..

| Edited By: Ravi Kiran

Apr 01, 2022 | 6:49 AM

Lovers commits suicide: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న యువతీ, యువకుడు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద ఘటన విశాఖపట్నం (Visakhapatnam district) జిల్లాలోని

Visakhapatnam: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. చివరకు పురుగుల మందు తాగి..
Crime
Follow us on

Lovers commits suicide: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న యువతీ, యువకుడు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద ఘటన విశాఖపట్నం (Visakhapatnam district) జిల్లాలోని కసింకోట మండలం మోసయ్యపేట పంచాయతీ శివారు గోకివానిపాలెంలో చోటుచేసుకుంది. గ్రామ శివారులోని తోటలో యువతి, యువకుడు నోట్లో నురగతో పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య చేసుకున్న యువకుడు బుచ్చియ్యపేట గ్రామానికి చెందిన మజ్జీ శ్రీను, యువతి కె కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన చల్లపల్లి హేమలతగా పోలీసులు గుర్తించారు. మజ్జి శ్రీనివాస్‌ చోడవరం బజాజ్ షోరూంలో పని చేస్తున్నాడని.. అతనికి పెళ్లి కాలేదని పోలీసులు తెలిపారు. అయితే.. హేమలతకు అంతకుముందే వివాహమైందని తెలిపారు. అయితే.. వీళ్లిద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:

Tirupati Crime: సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయొద్దు.. భారీగా ఫోన్లు స్వాధీనం

Crime news: టామాటా అని భార్యను గేలి చేశాడనుకుని.. వృద్ధుడిపై వ్యక్తి దాడి.. చివరకు