విజయనగరం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జిల్లాకు చెందిన నాగరాజు, పద్మావతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందో తెలియదు గానీ, నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలోని డైట్‌కోలనీ వద్ద కదులుతున్న రైల్లోంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు ఇద్దరు ప్రేమికులు. వెంటనే రైలును నిలుపుదల చేసి ఇద్దరినీ విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రియుడు నాగరాజుకు స్వల్ప గాయాలు కాగా, ప్రియురాలు పద్మావతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.