ప్రకాశంజిల్లాలో నడిరోడ్డుపై ఏర్పడిన ఓ పెద్ద గుంత ఆసక్తిగా మారింది. సాధారణంగా పూర్వ కాలంలో నిధి నిక్షేపాలను భూమిలోపల దాచుకుంటారని విన్నాం. కొన్ని చోట్ల చూశాం. అటువంటి మన పరిసర ప్రాంతాలలో భూమి లోపల నిక్షేపాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఆసక్తి, ఉత్సాహం చూపిస్తూ ఉంటారు కొందరు. కొన్ని ప్రాంతాలలో అలాంటివి అరుదుగా కనిపిస్తుంటాయి. మరికొన్ని ప్రాంతాలలో మన పూర్వీకులు విలువైన వస్తువులు, ధాన్యం, ఆహార పదార్ధాలు భద్రపరుచుకునేందుకు కొన్ని గుంతలను తీస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి. వాటికి సంబంధించిన ఒ ఘటనే తాజాగా ప్రకాశంజిల్లాలో వెలుగు చూసింది. రోడ్డుపై ఏర్పడిన గుంతపై ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోగోలు గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంత ఆ ప్రాంతంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గ్రామ ప్రజలే కాదు, ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఆ గుంతలో ఏముందని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బోగోలు గ్రామ సమీపంలో ఓ చిన్న గుంత ఏర్పడింది. ఆ మార్గంలో నిరంతరం వాహనాలు తిరుగుతూ ఉంటాయి. దీంతో ఆ గుంత మరింత పెద్దగా మారింది. కొద్దిరోజుల తర్వాత ఆ ప్రాంతంలో రంధ్రం ఏర్పడింది. అటువైపు నుంచి ప్రయాణిస్తున్న వాహనదారులు రోడ్డుపై ఏర్పాడిన గుంతను వింతగా చూశారు. అసలు ఏముంది అని లోపల చూడగా స్థానిక ప్రజలు వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదో విలువైన వస్తువులను దాచి పెట్టేందుకు ఎవరో ఇక్కడ గుంత తవ్వినట్టుగా.. ఒక గది ఏర్పరిచినట్టు కనిపించింది. దీంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చూడటానికి గుప్తనిధులను లేదా ఏదైనా విలువైన వస్తువులను దాచి పెట్టేందుకు తవ్వినట్టుగా ఉన్న ఆ గుంతతో ఓ గది ఉండటాన్ని ప్రజలు ఆశక్తిగా చూస్తున్నారు. స్థానికులు సంబంధిత అధికారులకు ఈ గుంతపై సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు గుంతను పరిశీలించి అందులో ఏమీ లేదని నిర్ధారించుకుని వెనుతిరిగారు. అయితే ప్రస్తుతం రోడ్డుపై ఏర్పడిన ఈ గుంత స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..