AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెల్ని పిండేసే విషాదం.. నీళ్ల డ్రమ్ములో ముంచి చిన్నారి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ నిజం..!

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల మధ్య వచ్చిన గొడవ, ఒక నిష్కల్మషమైన పసిప్రాణాన్ని బలితీసుకుంది. ఆడుకుంటూ కనిపించిన నిత్విక అనే చిన్నారిని బాత్రూంలోని నీళ్ల డ్రమ్ములో ముంచి దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గుండెల్ని పిండేసే విషాదం.. నీళ్ల డ్రమ్ములో ముంచి చిన్నారి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ నిజం..!
Girl Brutally Murdered
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jun 26, 2026 | 1:21 PM

Share

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల మధ్య వచ్చిన గొడవ, ఒక నిష్కల్మషమైన పసిప్రాణాన్ని బలితీసుకుంది. ఆడుకుంటూ కనిపించిన నిత్విక అనే చిన్నారిని బాత్రూంలోని నీళ్ల డ్రమ్ములో ముంచి దారుణంగా హత్య చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… గురువారం (జూన్ 25, 2026) సాయంత్రం 4:30 గంటల సమయంలో చిన్నారి నిత్విక ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఆ సమయంలో నిత్విక ఇంటి పక్కనే ఉండే స్వాతి అనే మహిళ, ఎవరూ లేని సమయం చూసి పాపను వెంటబెట్టుకుని వెళ్లింది. పక్క వీధిలోని ఒక ఇంటి బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి, అక్కడ ఉన్న నీళ్ల డ్రమ్ములో పాపను ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసింది.

స్నేహం కాస్తా పగగా మారి..!

చిన్నారి తల్లి సృజన, నిందితురాలు స్వాతి గతంలో ప్రాణ స్నేహితులు. అయితే పిల్లల విషయంలో వీరిద్దరి మధ్య చిన్న గొడవ మొదలై, అది కాస్తా తీవ్ర వైరంగా మారింది. ఈ వివాదం పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఆ కక్షను మనసులో పెట్టుకున్న స్వాతి, సృజనపై ఉన్న కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

దొరికిపోయిన నిందితురాలు

స్వాతి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాను పరిశీలించగా, ఆమె చిన్నారి నిత్వికను తన వెనుక పిలుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి పెద్దల పట్టింపులు, ఒక తల్లికి జన్మంతా తీరని శోకాన్ని మిగిల్చాయి.

షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

Follow Us