Andhra Pradesh: “నువ్వో బచ్చావి” – “మీరు మానసికంగా బాగుండాలి”

మంత్రి అమర్‌నాథ్‌, హరిరామజోగయ్య మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. రాజకీయాల్లో నువ్వు బచ్చావి అంటూ అమర్‌నాథ్‌పై జోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh: నువ్వో బచ్చావి - మీరు మానసికంగా బాగుండాలి
Chegondi Harirama Jogaiah - Gudivada Amarnath

Updated on: Feb 05, 2023 | 6:54 PM

ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య మధ్య లెటర్‌ వార్‌ జరుగుతోంది. లేఖలతోనే పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తున్నారు ఇద్దరు. అటు అమర్‌నాథ్‌, ఇటు హరిరామజోగయ్య చేస్తోన్న ఫైట్‌ మాత్రం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోసం. ఒకరు పవన్‌కు సపోర్ట్‌గా, మరొకరు అగైనెస్ట్‌గా మాటల తూటాలు పేల్చుతున్నారు.

మంత్రి అమర్‌నాథ్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు హరిరామజోగయ్య. రాజకీయాల్లో నువ్వో బచ్చావి అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. ఎందుకు పనికిరాని మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్‌ నాశనం చేయకంటూ సూచించారు. నీ మంచి కోరి చెబుతున్నా పవన్‌ కల్యాణ్‌‌పై బురద చల్లొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చారు జోగయ్య.

హరిరామజోగయ్య లేఖకు అంతే స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చారు గుడివాడ అమర్‌నాథ్‌. స్మూత్‌గా చెబుతూనే గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌కు చెప్పాల్సినవి పొరపాటున తనకు చెప్పారేమో అంటూ ప్రతి లేఖ రాశారు. కాపుల భవిష్యత్‌ను నాశనం చేయొద్దని చంద్రబాబుతో జతకడుతోన్న పవన్‌కు చెప్పాలన్నారు అమర్‌నాథ్‌. అయినా, మీరు మానసికంగా బాగుండాలంటూ జోగయ్యపై సెటైర్లేశారు అమర్‌నాథ్‌. టీడీపీలో పవన్‌ ఓ సీనియర్‌ కార్యకర్త మాత్రమే అన్నారు. పవన్‌ను నమ్మి మోసపోవద్దని కాపులకు సూచించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..