Lepakshi: శిల్ప కళల సౌందర్యం.. అబ్బురపరిచే వింతలు.. లేపాక్షి బసవన్నకు యునెస్కో తాత్కాలిక గుర్తింపు..

|

Mar 29, 2022 | 10:15 AM

ఆ క్షేత్రం.. శిల్ప కళల సౌందర్యం.. అబ్బురపరిచే వింతలకు నిలయం.. అంతకు మించి ప్రాసిశ్త్యం ఉన్న ప్రాంతం.. లేచి రంకెలు వేసేందుకు సిద్ధంగా ఉన్న లేపాక్షి బసవన్న, గాలిలోనే వేలాడుతున్న స్తంభం.. ఏడు శిరస్సుల నాగుపాము..

Lepakshi: శిల్ప కళల సౌందర్యం.. అబ్బురపరిచే వింతలు.. లేపాక్షి బసవన్నకు యునెస్కో తాత్కాలిక గుర్తింపు..
Lepakshi
Follow us on

ఆ క్షేత్రం.. శిల్ప కళల సౌందర్యం.. అబ్బురపరిచే వింతలకు నిలయం.. అంతకు మించి ప్రాసిశ్త్యం ఉన్న ప్రాంతం.. లేచి రంకెలు వేసేందుకు సిద్ధంగా ఉన్న లేపాక్షి బసవన్న(Lepakshi), గాలిలోనే వేలాడుతున్న స్తంభం.. ఏడు శిరస్సుల నాగుపాము.. సీతమ్మ పాదం నుంచి నిత్యం కనిపించే జలధార ఇలా ఒకటేంటి చెబుతూ పోతో ఎన్నో విశిష్టతలకు నిలయం లేపాక్షి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శిల్ప కళలకు నిలయంగా ఉన్న లేపాక్షికి ఆ స్థాయిలో ప్రాచుర్యం లభించింది.  ఇప్పుడు ప్రపంచ పటంలో లేపాక్షికి స్థానం దక్కింది. యునెస్కో జాబితాలో తాత్కాలికంగా చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చే యునెస్కో.. ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లా లేపాక్షి ఆలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చింది. భారత్‌ నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా అందులో ఏపీ నుంచి అనంతపురానికి చెందిన లేపాక్షి ఆలయం ఉండటం విశేషం.

Lepakshi Temple

మరో 6 నెలల్లో వారసత్వ కట్టడాలపై యునెస్కో తుది జాబితా విడుదల చేయనుంది. శిల్ప సంపదకు నెలవైన లేపాక్షి.. వారసత్వ కట్టడాల జాబితాలో తాత్కాలిక గుర్తింపు దక్కడంపై జిల్లావాసులతోపాటు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Lepakshi

అయితే.. గత కొంత కాలంగా లేపాక్షిని యునెస్కో జాబితాలో చేర్చేందుకు కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజే వెంకటేష్‌ నేతృత్వంలోని ప్రయత్నాలు జరిగాయి.

ఇవి కూడా చదవండి: Gangster Naeem: గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్‌.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌..

ఈ ఫోటోలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో గుర్తుపట్టండి చూద్దాం.. మీరు మొదట చూసేదే మీ వ్యక్తిత్వం..