Srisailam: అరగంటసేపు డివైడర్ పైనే తిష్ట.. వణికిపోయిన స్థానికులు

| Edited By: Ram Naramaneni

Jul 18, 2024 | 3:06 PM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుత సంచారం టెన్షన్ రేపింది. శ్రీశైలంలోని పాతాళ గంగ మెట్ల మార్గానికి సమీపంలో సంచరించిన చిరుత రోడ్డు డివైడర్ పైనే అర్ధగంట పాటు తిష్ట వేసింది. చిరుత విజువల్స్ ను భక్తులు తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు.

Srisailam:  అరగంటసేపు డివైడర్ పైనే తిష్ట.. వణికిపోయిన స్థానికులు
Leopard
Follow us on

నంద్యాల జిల్లా శ్రీశైలం… పాతాళ గంగ పాత మెట్ల మార్గం వెళ్లే వైపు చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాత మెట్ల మార్గం ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో నుండి చిరుతపులి బయటకు వచ్చి రోడ్డు వద్ద డివైడర్ పైకి రావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరుత పులి చాలాసేపటి వరకు సుమారు అర్ధగంట సేపు డివైడర్ వద్ద అటూ ఇటూ తిరిగిన దృశ్యాల్ని స్థానికులు తమ సెల్ ఫోన్‌లో వీడియో తీశారు. చాలాసేపు డివైడర్‌పై కూర్చొని పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్ళిపోయింది చిరుత. జనావాసం ఉన్న ప్రాంతంలో చిరుత పులి బయటకు రావడంతో పాత మెట్ల మార్గంలోని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.  గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు చిరుత పులి సంచరించగా అప్పట్లో అటవీశాఖ అధికారులు డోలు శబ్దాలు చేయించడంతో తర్వాత దాని జాడ కనిపించలేదు. కానీ మళ్లీ అదే తరహాలో ఇప్పుడు అదే ప్రాంతంలో తిరుగుతుండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.

ఇప్పుడు కూడా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత పులి నివాస ప్రాంతాలలోకి రాకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. అయితే స్థానికులు, భక్తులు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.  ఇటు మహానంది ఆలయాన్ని కూడా చిరుత టెన్షన్ వదలడం లేదు. బుధవారం కూడా చిరుత ఆలయ శివారులో సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. నెల రోజుల వ్యవధిలో 20 సార్లు పైగా చిరుత ఆలయం చుట్టూ తిరిగి వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి చిరుతలు ఆలయాల పరిసరాల్లోకి రాకుండా చూడాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..