
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. బుధవారం వరకు ఎండలు దంచికొట్టగా.. గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. 2026 మే 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నిన్నటి నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతప్రాంతాల్లో నున్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు , 2026 మే 14వ తేదీన, భారత కాలమానం ప్రకారం ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతున్నది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. నైరుతి – ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం కేంద్రం నుండి, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీంతోపాటు నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి నైరుతి మధ్యప్రదేశ్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ అంతర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఈరోజు తక్కువగా గుర్తించబడినది.
గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40 -50కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40 -50కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40 -50కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాంలో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. ఆ తరువాత 3 రొజుల్లో 2 -3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేకుండా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
ఈనెల 16 వ తారీఖు నాటికీ నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
నిన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 5.8 కి. మీ ఎత్తువరకు కొనసాగుతోంది.
గురువారం, శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని ఒకటి రెండు తూర్పు, పశ్చిమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings): ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నుండి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..