Land Grabbing: విశాఖలో భారీ భూ కుంభకోణం.. 100 కోట్ల విలువైన భూముని 19 కోట్లకు కొనేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే

|

Sep 06, 2021 | 8:50 PM

విశాఖలో భారీ భూ కుంభకోణం బయటపడింది. ల్యాండ్‌ ఓనర్ విదేశాల్లో ఉండటాన్ని అదనుసుగా చేసుకొని గ్యాంబ్లర్స్ వంద కోట్ల విలువైన భూమిని ఓ

Land Grabbing: విశాఖలో భారీ భూ కుంభకోణం.. 100 కోట్ల విలువైన భూముని 19 కోట్లకు కొనేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే
Khanamet Lands E Auction
Follow us on

Massive Land scam in Visakhapatnam: విశాఖలో భారీ భూ కుంభకోణం బయటపడింది. ల్యాండ్‌ ఓనర్ విదేశాల్లో ఉండటాన్ని అదనుసుగా చేసుకొని గ్యాంబ్లర్స్ వంద కోట్ల విలువైన భూమిని ఓ ప్రజాప్రతినిధికి అమ్మేందుకు ప్రయత్నించారు. విశాఖ అడ్డాగా జరిగిన ఈ భారీ ల్యాండ్‌ స్కామ్‌లో కీలక నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. విశాఖలో రూ. 80కోట్ల రూపాయల విలువ చేసే భూమిని యజమాని ప్రమేయం లేకుండా అమ్మాలని కొందరు ప్లాన్ వేశారు. ఇందుకోసం తప్పుడు జీపీఏ తెప్పించి…భూమిని కొనుగోలు చేసేందుకు వచ్చిన వాళ్లను మోసం చేశారు.

కొమ్మాదిలో 12.26 ఎకరాల భూమికి యజమానిగా ఉన్నారు తుమ్మల కృష్ణచౌదరి. కొద్దిరోజుల క్రితమే ల్యాండ్‌ ఓనర్‌ అమెరికాకు వెళ్లారు. అయితే ఓనర్ స్థానికంగా లేకపోవడంతో కోట్లు విలువ చేసే ఆ 12.26 ఎకరాల భూమిని పలుకుబడి ఉన్న వ్యక్తులకు కట్టబెడితే కోట్లు వచ్చిపడతాయని భావించారు గ్యాంబ్లర్స్. తుమ్మల కృష్ణచౌదరికి పరిచయమున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి.. ఇందుకు పక్కా ప్లాన్ వేశాడు. జగదీష్‌ అనే మరో వ్యక్తితో కలిసి ఏడాదిన్నర క్రితం ఇదే ల్యాండ్‌ని అమ్మేందుకు సిద్ధమయ్యారు.

ఈ ల్యాండ్‌ని అమ్మడానికి కశ్యప్ డెవలపర్స్‌ని కాంటాక్ట్ చేశారు నిందితులు. యలమంచిలి ఎమ్మెల్యే అయిన కన్నబాబురాజు కుమారుడు సుకుమార్‌ వర్మదే కశ్యప్ డెవలపర్స్. ఈ 12.26 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారు ఎమ్మెల్యే కన్నబాబురాజు సంబంధీకులు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయమని పట్టుబట్టడంతో సూత్రధారులు కొత్త డ్రామా ఆడారు. అమెరికాలో ఉన్న ఆనందరాజు అనే వ్యక్తిని భూమి యజమాని కృష్ణచౌదరిగా కశ్యప్‌ డెవలపర్స్‌ని నమ్మించారు. ఆనందరాజు నుంచే కృష్ణ చౌదరి పేరుతో జీ పీ ఏ తెప్పించారు. దాని ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయిద్దామనుకున్న టైమ్‌లో గుట్టురట్టైంది.

రూ.80 కోట్ల విలువైన భూమిని రూ.18.70 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చి రూ. 5 కోట్లు చెల్లించారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లేట్ కావడంతో.. పేపర్‌లో భూమిని కొన్నట్లు ప్రకటన ఇచ్చారు. భూమి యజమాని కృష్ణ చౌదరి భార్య లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదుతో నేరానికి పాల్పడ్డ శ్రీనివాసరావు, జగదీష్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. అమెరికాలో ఉంటూ భూమి ఓనర్‌గా ఫోన్‌లో మాట్లాడిన ఆనందరాజుని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీపీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు.

Mla Kannababu Raju

Read also: తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ప్రతాపానికి బ్రిడ్జ్‌లు సైతం కొట్టుకుపోతున్నాయ్.. వాగులు దాటుతున్న క్రమంలో ప్రాణాలు పోతున్నాయ్..