KVS Admissions 2022: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..

|

Mar 22, 2022 | 12:41 AM

కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపొందించినట్లు..

KVS Admissions 2022: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..
Kvs Admissions 2022
Follow us on

Kendriya Vidyalaya Machilipatnam Admission 2022 last date: కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపొందించినట్లు మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయ (KVS Machilipatnam) ప్రిన్సిపల్ జె సత్యనారాయణ తెలిపారు. ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీగా మార్చి 21 ని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా అప్లికేషన్లు సమర్పించడానికి తుది గడువును ఏప్రిల్ 11 వరకు పెంచినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు తుది గడువులోపు తమ దరఖాస్తు ఫామ్‌లను సమర్పించాలని, విద్యార్ధుల తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఈయన అన్నారు.

కాగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ యథాతథంగా తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి పలు విద్యా సంస్థలు ప్రవేశాలకు నోటిఫికేషన్లు సైతం విడుదల చేశాయి. పరిస్థితి కొంత సర్దుమనుగుతుందని అనుకుంటున్నా.. మరోవైపు కరోనా నాలుగో వేవ్ గుబులురేపుతోంది.

Also Read:

AIIMS Gorakhpur 2022: నెలకు రూ. 67 వేల జీతంతో ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్ జాబ్స్..