Road Accident: శబరిమలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఇద్దరు కర్నూలు వాసుల మృతి

|

Dec 09, 2021 | 4:09 PM

Sabarimala Road Accident: అయ్యప్ప మాలను ధరించి వారంతా శబరిమలకు ప్రయనమయ్యారు. మరికాసేపట్లో శబరిమలకు చేరుతారనగా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో

Road Accident: శబరిమలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఇద్దరు కర్నూలు వాసుల మృతి
Road Road Accident
Follow us on

Sabarimala Road Accident: అయ్యప్ప మాలను ధరించి వారంతా శబరిమలకు ప్రయనమయ్యారు. మరికాసేపట్లో శబరిమలకు చేరుతారనగా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. నగరంలోని బుధవారపేటకు చెందిన అయ్యప్పస్వాములు వాహనంలో శబరిమలకు పయనమయ్యారు. శబరిమలకు 60 కిలోమీటర్ల దూరంలో టెంపో వాహనాన్ని నిలిపి టీ తాగుతుండగా.. వెనుక నుంచి మరో వాహనం టెంపోను ఢీకొట్టి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. 9మందికి గాయాలయ్యాయి. మృతులను బధవారపేట, దేవనగర్‌కు చెందిన ఆదినారాయణ, శంకర్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బుధవారం కర్నూలు నగరం నుంచి 11 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు బయలుదేరారు. గురువారం ఉదయం 9:30 గంటల సమయంలో శబరిమలకు 60 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొంటున్నారు. బస్సు టెంపోను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే.. కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read:

Cheddi Gang: బెజవాడలోనే మకాం వేసిన చెడ్డీగ్యాంగ్.. వెలుగులోకి మరో దోపిడి ఘటన.. వీడియో

రూ.1000 కోట్ల ఆదాయంపై పన్ను ఎగ్గొట్టిన ఓ సంస్థ.. ఐటీ దాడుల్లో బయటపడిన అక్రమాల చిట్టా