ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది అరటి రైతుల పరిస్థితి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులు అరటి పంటలు భారీగా సాగు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం కన్ను ఒకటి వెయ్యి నుంచి 2000 ఉండే ది. అరటి కోసే కూలీలకు కూడా ఆ ధర సరిపోక రైతులు ఎక్కడపడితే అక్కడ పారవేశారు.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది అరటి రైతుల పరిస్థితి
Kurnool

Edited By:

Updated on: Mar 07, 2026 | 3:01 PM

వెంకీ పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది అరటి రైతుల పరిస్థితి. ఎక్కడో అమెరికా ఇరాన్ పై దాడి చేసి యుద్ధం చేస్తుంటే ఆ ప్రభావం కర్నూలు జిల్లా అరటి రైతులకు తీవ్రంగా పడింది వారి పాలిట శాపంగా మారింది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులు అరటి పంటలు భారీగా సాగు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం కన్ను ఒకటి వెయ్యి నుంచి 2000 ఉండే ది. అరటి కోసే కూలీలకు కూడా ఆ ధర సరిపోక రైతులు ఎక్కడపడితే అక్కడ పారవేశారు. ఇంకా కొన్ని అయితే పశువులకు మేతగా వేశారు. ఆ తర్వాత పుంజుకుని టన్ను అరటి 25 వేల వరకు వెళ్ళింది. ఇరాన్ పై అమెరికా దాడి చేయకముందు వరకు ఆ ధర పలికింది. ఖర్చులన్నీ కూడా కరెంటు రైతులకు ఎకరాలు రెండు లక్షలకు పైగా మిగిలేది. గల్ఫ్ యుద్ధంతో ఒక్కసారిగా పడిపోయింది . టన్ను అరటి ధర 10 వేలు కూడా రావడం లేదని, రెండు మూడు రోజుల వివాదిలోని 60 శాతం పైగా ధర పడిపోవడం తప్ప రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ సహా గల్ఫ్ కంట్రీస్ కి యుద్ధం కారణంగా ఆ దేశాలకి అరటి ఎగుమతులు నిలిచిపోవడంతో ధర పతనమైనట్టు వ్యాపారులు రైతులు చెప్తున్నారు. ధర కోసం వేచి చూస్తే పొలంలోని అరటి మాగిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Follow Us