Anil Kumar Yadav – Chandrababu: రాయలసీమకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అన్యాయం చేశారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. చంద్రబాబు సీమ గురించి ఏరోజు అయినా ఆలోచన చేశారా? అంటూ ఆయన నిలదీశారు. రాయలసీమకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఆలోచన చేస్తే కనీసం మద్దతు అయినా తెలిపే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. ఇవాళ నెల్లూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర పార్టీ నేతలపై మండిపడ్డారు.
సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, గండికోట, చిత్రావతి పనులు మొదలుపెట్టామని, అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయని మంత్రి అనిల్ వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు నీరుగార్చారన్న అనిల్ యాదవ్.. టీడీపీ తన ప్యాకేజీల కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను తాకట్టుపెట్టింది వాస్తవం కాదా? దానివల్లే ఇవాళ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు నిధుల కొరత ఏర్పడటం నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టే నాటికే వరద నీరు వృధాగా సముద్రంలో కలిసిపోవడం చూశామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. అలాగే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 854 అడుగులు వస్తేనే నీళ్లు తీసుకోలేకపోతున్నాం.. అదే తెలంగాణ రాష్ట్రం వాళ్లు 800 అడుగుల్లోనే నీళ్లు వాడుకుంటున్నారు. దాంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు తీసుకెలేకపోతున్నాం. అందుకే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచాం. అని మంత్రి తెలిపారు.
Read also: Mani Sharma Son Marriage: అట్టహాసంగా సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్