Couple suicide attempt in Police station : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం చోటుచేసుకుంది. ఎంతటి కష్టమొచ్చిందో ఏమో.. ఏకంగా పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణం లోనే ఒక ప్రేమజంట ఆత్మహత్య కు యత్నించింది. అదీ.. నిన్ననే ఈ ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నట్టు సమాచారం. గాయత్రి(18) సురేష్(20)లు చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిది ఆస్పరి మండలం బన్నురు గ్రామం. కాగా, ప్రేమికులు గాయత్రి, సురేష్ ఇద్దరూ ఎమ్మిగనూరులోని వాళ్ల తాతయ్య ఇంట్లో కొంతకాలంగా తాలదాచుకుంటున్నారు. అయితే, పోలీస్ కేసు నేపథ్యంలో వీరిద్దర్ని ఎమ్మిగనూరు పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దీంతో విడదీస్తారనే భయంతో స్టేషన్ ఆవరణలోనే నవదంపతులిద్దరూ శానిటైజర్ తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. దీంతో వీరద్దర్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే, ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉన్నట్టు సమాచారం.