AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: కర్నూల్‌లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. బస్టాండ్‌లో విధులు నిర్వహిస్తుండగా ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. గమనించిన స్థానికులు వెంటనే మంటలార్పి, గాయపడిన మహిళను హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: కర్నూల్‌లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు
Adoni Bus Stand Incident
Anand T
|

Updated on: Sep 06, 2026 | 9:54 AM

Share

బస్టాండ్‌లో శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవిస్తోంది. అయితే తాజాగా ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సమ్మ శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా సడెన్‌గా అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళలు.. ఒక్కసారిగా నర్సమ్మపై దాడికి దిగారు.

నర్సమ్మ కళ్లలో కారం కొట్టి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇది గమనించిన స్థానిక శానిటేషన్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సమ్మను స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నర్సమ్మ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ దాడికి గల కారణాలు ఏంటి? వీళ్లకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ
రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్
వైకల్యాన్ని ఓడించి.. కాళ్లతోనే చదివి టీచర్‌గా మారాడు!
వైకల్యాన్ని ఓడించి.. కాళ్లతోనే చదివి టీచర్‌గా మారాడు!
చిటికెడు పొడితో మోకాళ్ల నొప్పులు, వాపులు శాశ్వతంగా పోతాయ్
చిటికెడు పొడితో మోకాళ్ల నొప్పులు, వాపులు శాశ్వతంగా పోతాయ్
పెళ్లి విషయం అడిగేందుకు లవర్ ఇంటికి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే
పెళ్లి విషయం అడిగేందుకు లవర్ ఇంటికి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే
చెన్నై వేదికగా నేటి నుంచే దులీప్ ట్రోఫీ ఫైనల్
చెన్నై వేదికగా నేటి నుంచే దులీప్ ట్రోఫీ ఫైనల్
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
33 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సా
33 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సా
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్: ప్రధాని మోదీ
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్: ప్రధాని మోదీ
పొద్దున్నే ముఖం బంగారంలా మెరవాలా..? రాత్రి పడుకునే ముందు..
పొద్దున్నే ముఖం బంగారంలా మెరవాలా..? రాత్రి పడుకునే ముందు..