అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పా సినిమా అందరికీ తెలిసిందే..పుష్ఫ అనగానే ప్రతి ఒక్కరికీ టక్కున్న గుర్తుకు వచ్చేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు. ఈ స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. కానీ.. అదే సినిమాలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కొరకు చేసిన రకరకాల సన్నివేశలను ఆదర్శంగా తీసుకున్న కొంతమంది అవే సీన్స్‌ని కాపీ కొడుతూ గుట్టుగా మద్యం అమ్మకాలు సాగిస్తూ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు, అధికారుల కంటపడకుండా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సాగుతున్న మద్యం అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేశారు సెబ్ పోలీసులు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. మద్యం అక్రమ రవాణాను అరికట్టెందుకు ఎమ్మిగనూరు, మంత్రాలయం,మండలల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
పుష్ప సినిమాలో సన్నివేశాలను కాపీ కొట్టిన కొందరు అక్రమార్కులు తమ వ్యాపారం కోసం ఒక పెద్ద షెడ్డు మాదిరిగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ షెడ్డుకు ఒక చిన్న సొరంగం ఏర్పాటు చేసి అందులో లిక్కర్ దాచి గుట్టుగా అమ్ముకుంటున్నారు. మరొకరు బట్టల వ్యాపారం చేస్తునట్టుగా నమ్మించి..బాక్స్ ల్లో మద్యం తరలిస్తుండగా సెబ్ పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 90 ML కర్ణాటక మద్యం 1038 టేట్రా ప్యాకెట్లు సిజ్ చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుపడ్డ మొత్తం మద్యం విలువ 55 వేల రూపాయలు గా ఉంటుందని సెబ్ సీఐ జయరాం నాయుడు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..