చిత్ర విచిత్రాల కర్నూలు నగర మాజీ మేయర్ బంగి అనంతయ్య మరోసారి తన తనదైన స్టైల్‌లో అందరినీ ఆకర్షిస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ. 2,750 రూపాయల పెన్షన్ అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని కర్నూలు కలెక్టరేట్ వద్ద మహిళ వేషధారణలో హల్‌చల్ చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ.. తలపై జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని మోస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ బంగి అనంతయ్య మాట్లాడుతూ ప్రతి మనిషికి 100 సంవత్సరాలు ఆయుష్షు ఉంటే ముఖ్యమంత్రి చేపట్టే, చేపడుతున్న పథకాలు సేవా కార్యక్రమాలు 2,000 సంవత్సరాల దాకా గుర్తుంటాయని అన్నారు.
ప్రజలకు మంచి చేసే ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని ఎవరూ మర్చిపోరని అన్నారు. పెన్షన్ పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల బంగి సంతోష్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మాజీ మేయర్ బంగి అనంతయ్య మహిళ వేషధారణ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..