KRMB meet: తెలుగు రాష్ట్రాల తాగు, సాగు నీటి సమస్యకు యాక్షన్‌ ప్లాన్‌ షురూ.. కేఆర్ఎంబీ కమిటీ భేటీలో కీలక చర్చ

|

Dec 09, 2021 | 4:40 PM

తెలంగాణ, ఏపీ సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి యాక్షన్‌ ప్లాన్‌ షురువైంది. కృష్ణా నదీ యాజమాన్యపు బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ వర్చువల్‌ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు.

KRMB meet: తెలుగు రాష్ట్రాల తాగు, సాగు నీటి సమస్యకు యాక్షన్‌ ప్లాన్‌ షురూ.. కేఆర్ఎంబీ కమిటీ భేటీలో కీలక చర్చ
Krmb
Follow us on

KRMB vartual Meet: తెలంగాణ, ఏపీ సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి యాక్షన్‌ ప్లాన్‌ షురువైంది. కృష్ణా నదీ యాజమాన్యపు బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ వర్చువల్‌ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ సాగు, తాగునీటి అవసరాలపై అధికారులు చర్చించారు.

కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కీలకాంశాలపై చర్చ జరిగింది. యాసంగిలో సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై ప్రధానంగా చర్చించారు సభ్యులు. సమావేశంలో బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్సీలు, అధికారులు పాల్గొన్నారు. 15 రోజుల్లో ముగిసే ఖరీఫ్ పంట కోసం కాకుండా.. రాబోయే యాసంగి సీజన్ కోసం చర్చించాలని తెలంగాణ సూచించింది. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ ప్రతిపాదనకు ఏపీ సుముఖత వ్యక్తం చేసింది. యాసంగి సీజన్‌కు సాగునీటి కోసం 150 టీఎంసీలు.. తాగునీటి కోసం 90 టీఎంసీలు అవసరమవుతాయని తెలంగాణ పేర్కొంది. ఖరీఫ్ 15 రోజుల సీజన్ కోసం 23 టీఎంసీలు కావాలని ఏపీ కోరింది. త్వరలో మరోసారి సమావేశమైన నిర్ణయం తీసుకుందామని కేఆర్‌ఎంబీ తెలిపింది.

ఇదిలావుంటే, ఖరీఫ్‌లో ఈనెల 15వ తేదీ దాకా నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద 11.77 టీఎంసీలు, కుడికాలువ కింద 2.55 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి 5.22 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి కోసం 4.14 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి కేటాయించాలని కోరుతూ కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఈఎన్సీ. ఈ భేటీలో తెలంగాణ సైతం ఏ మేరకు నీళ్లు కావాలో వివరాలు అందించింది. సమావేశంలో నీటి కేటాయింపులపై చర్చించిన కమిటీ.. తుది ఉత్తర్వులు ఇవ్వనుంది.

గతంలో ఏపీకి 207 టీఎంసీలను కేటాయించగా.. ఇందులో నవంబర్‌ 30 వరకు ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 183.32 టీఎంసీల నీటిని ఉపయోగించుకున్నామని ఏపీ తన ఇండెంట్‌లో వెల్లడించింది. ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి నీళ్లు సముద్రంలోకి పోయే రోజుల్లో అదనంగా 32.16 టీఎంసీలు తీసుకున్నామని తెలిపింది.

Read Also… CM Jagan on Irrigation: ఏపీ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు!