Andhra Weather: తుఫాన్ ఎఫెక్ట్ పోయినట్లే అనుకుంటే ఇదేంటి.. ఏపీలో శుక్రవారం..

కృష్ణానది వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులు నమోదయ్యాయని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. ..

Andhra Weather: తుఫాన్ ఎఫెక్ట్ పోయినట్లే అనుకుంటే ఇదేంటి.. ఏపీలో శుక్రవారం..
Weather Report

Updated on: Oct 31, 2025 | 5:52 PM

శుక్రవారం(31-10-2025) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. శుక్రవారం నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందన్నారు. ఎగువ వర్షాలకు కృష్ణానది కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉందన్నారు. కృష్ణా, పెన్నా నదీపరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపొర్లుతున్న ఉపనదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.

ఇక.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరదను ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజికి 6 నుంచి 6.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉండడంతో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ మందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.