కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం రౌడీ షీటర్లు, అనుమానితులు, నాటుసారా కాచే వాళ్లకు ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. వినూత్న విధానంలో భారీ గ్రౌండ్‌లో స్టేజీ ఏర్పాటు చేసి.. దానిపై నుంచి కౌన్సిలింగ్ ఇచ్చారు జిల్లా ఎస్పీ. 2530 మంది క్రైమ్ అనుమానితులు, రౌడీషీటర్లకు, నాటు సారా, మద్యం గంజాయి రవాణా చేసే వారికి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం 40 మండలాలలోని వారిని బస్సులలో తీసుకొచ్చారు పోలీసులు. ఏపీ ప్రభుత్వం, పోలీసు శాఖ కలిసి ఈ రకమైన కౌన్సిలింగ్ ఇస్తున్నారు. స్పెషల్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రతీ చిన్న పొరపాటుకు కేసులు ఉంటాయని పోలీసు శాఖ హెచ్చరించింది. కేసులు సంఖ్య పెరిగితే హిస్టరీ షీటు, రౌడీ షీటు ఓపెన్ అవుతాయని వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ. ఇలా క్రైమ్స్ చేసేవాళ్లకు ప్రభుత్వం నుంచీ వచ్చే పథకాలు క్యాన్సిల్ చేయాలనే ప్రపోజల్ ఉన్నట్లు చెప్పారు. చెప్పినా మాట విననివారిని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు… ద్వారా 6 నెలలు జైలులో ఉంచడం జరుగుతుందని హెచ్చరించారు. స్పెషల్ యాక్షన్ ప్లాన్ చేయడానికి ముందుగా ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని.. కౌన్సిలింగ్ ద్వారా మారిన వారి కుటుంబాలలో చదువుకున్న వారికి ఉద్యోగం కల్పిస్తామని ఎస్పీ చెప్పారు. మారకుండా మేము ఇలానే ఉంటాం అంటే తాట తీస్తామని చెప్పారు.
Also Read: గుండెపోటుతోనే మరణించిన పునీత్ తండ్రి.. అతడి సోదరుడికి కూడా గతంలో హార్ట్ ఎటాక్