Vijayawada, July 20: ఈ నెల 21 నుంచి ఎన్నికల కమిషన్ నెలరోజులపాటు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం చేపడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వచ్చి ఓటర్లను వెరిఫికేషన్ చేస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు.ఓటరుగా ఇప్పటికే నమోదు చేసుకున్న వారు తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో సుమారు 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్ జాబితాల పరిశీలన చేపట్టింది ఎన్నికల కమిషన్. ఇప్పటికే రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై అధికార, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఒకవేళ జాబితాలో పేరు లేకుంటే వెంటనే చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లినప్పుడు వారి వెంట రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా వెళ్లి ఓటర్లను చెక్ చేసుకోవచ్చని ముఖేష్ కుమార్ మీనా సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..