Mekapati Goutham Reddy Died: కొద్దిరోజుల క్రితం కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar).. ఇప్పుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఇద్దరూ హార్ట్ ఎటాక్‌తోనే చనిపోయారు. ఇద్దరి వయసు 50ఏళ్లలోపే. జిమ్ అలవాటు ఉన్న వీళ్లిద్దరూ ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. చెరగని చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపిస్తారు. రాజ్‌కుమార్ షూటింగ్‌లతో ఎంతబిజీగా ఉన్నా ఎక్సర్‌సైజ్ చేయడం మాత్రం మరచిపోయేవాళ్లు కాదు. గౌతమ్ రెడ్డి కూడా అంతే పొలిటికల్‌గా ప్రజల మధ్య తిరిగేవారు. కానీ ఎక్కడా అలసట అనేదే కనిపించేది కాదు. కానీ హఠాత్తుగా గుండెపోటు(Heart Attack)తో చనిపోవడం విషాదం నింపింది.
దుబాయ్ టూర్‌తో ఆల్రెడీ అలసిపోయిన గౌతమ్‌రెడ్డి.. వచ్చి రాగానే మరో ప్రోగ్రామ్‌లో పాల్గొనడమే హార్ట్ స్ట్రోక్‌కి కారణమైందా? హఠాన్మరణం వెనక పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఉండొచ్చంటున్నారు డాక్టర్లు. పోస్ట్ కోవిడ్ తర్వాత హార్ట్ ఎటాక్స్, కార్డియాక్ అరెస్టులు పెరిగాయంటున్నారు. గౌతమ్ డెత్‌కి పోస్ట్ కోవిడ్ లక్షణాలే కారణం కావొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. అసలు పోస్ట్ కొవిడ్ సమస్యలపై డాక్టర్లు ఏమంటున్నారో చూద్దాం.
గుండెపై పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని చెబుతోంది అమెరికా అధ్యయనం. కరోనా వైరస్, గుండె లోపలి కణాలను చంపేస్తున్నట్లు గుర్తించింది. పోస్ట్ కోవిడ్ తర్వాత గుండె సంకోచ వ్యాకోచాల్లో తేడా వస్తున్నట్టు ఐడెంటిఫై చేసింది. పోస్ట్ కోవిడ్ తర్వాత గుండె సమస్యలు పెరిగాయన్న అమెరికా రీసెర్చ్ టీమ్, సడన్ హార్ట్ స్ట్రోక్స్, కార్డియాక్ అరెస్ట్‌లతో మరణాలు పెరిగినట్లు వెల్లడించింది.
యువకుల్లో గుండెపోటుతో వచ్చే చిక్కేంటంటే దానికి సంబంధించిన లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం. చాలాసార్లు నిశ్శబ్దంగా విరుచుకుపడి ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే యువత 25 ఏళ్లు దాటాకా గుండె ఆరోగ్యాన్ని తెలిపే టెస్ట్‌లు చేయించుకోవడం బెటర్ అంటున్నారు డాక్టర్లు. అయితే ఎప్పుడూ ఫిట్‌గా ప్రశాంతంగా కనిపించే పునీత్ రాజ్‌కుమార్, గౌతమ్‌రెడ్డిలు గుండెపోటుతో చనిపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
Also Read: Goutham Reddy: డైనమిక్ లీడర్ గౌతమ్‌రెడ్డి అరుదైన ఫోటోలు..
Mekapati Goutham Reddy: అజానుభావుడి మరణంతో తల్లడిల్లుతున్న నెల్లూరు జిల్లా.. ఎల్లుండి అంత్యక్రియలు