
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.. ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం మరువకముందే.. పలు ప్రాంతాల్లో ఘోర ప్రమాదాలు జరగుతుండటం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఏపీలోని ఎన్డీఆర్ జిల్లాలో K.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. విజయవాడ వెళ్తున్న క్రమంలో.. K.కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొంది.. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.. మరి కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి.. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఓవర్టేక్ చేసే క్రమంలో కావేరి ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
కావేరి ట్రావెల్స్ బస్సు, లారీ హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వస్తున్నాయని. ఈ క్రమంలోని.. వెనుక నుంచి లారీని బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే స్పందించిన హైవే మొబైల్ సిబ్బంది క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో అందరూ ప్రాణాలతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు వేగంతో లారీని ఢీకొట్టడంతో.. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..