AP News: వంటింట్లో వింత శబ్దాలు.. భయం.. భయంగా ఏంటని వెళ్లి చూడగా గుండెలు అదిరే.!

|

May 30, 2024 | 1:43 PM

సాధారణంగా పాములంటేనే భయంతో వణికిపోతుంటాం.. దూరంలో కనిపిస్తేనే పరుగులు తీస్తాం.. అలాంటి ఓ భారీ నాగు పాము ఏకంగా వంటింట్లోనే తిష్టవేసింది. కుటుంబసభ్యులకు ఆ గదిలో నుంచి శబ్దాలు వినిపించాయి.. దీంతో ఏంటోనని చూడగా కింగ్ కోబ్రా కనిపించింది.. ఆ వివరాలు ఇలా..

AP News: వంటింట్లో వింత శబ్దాలు.. భయం.. భయంగా ఏంటని వెళ్లి చూడగా గుండెలు అదిరే.!
Representative Image
Follow us on

సాధారణంగా పాములంటేనే భయంతో వణికిపోతుంటాం.. దూరంలో కనిపిస్తేనే పరుగులు తీస్తాం.. అలాంటి ఓ భారీ నాగు పాము ఏకంగా వంటింట్లోనే తిష్టవేసింది. కుటుంబసభ్యులకు ఆ గదిలో నుంచి శబ్దాలు వినిపించాయి.. దీంతో ఏంటోనని చూడగా కింగ్ కోబ్రా కనిపించింది.. దీంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని స్నేక్ క్యాచర్ ను పిలిపించారు. చివరకు దానిని రెస్క్యూ చేసి సురక్షితప్రాంతంలో వదిలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్ ఘటన అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చోటుచేసుకుంది. ముమ్మిడివరంలో ఓ ఇంట్లోని వంటింట్లో గట్టుపైన ఓ నాగు పాము తిష్టవేసింది. దీంతో తిరుపతి గోవిందురాజు కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వర్మకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన గణేష్‌ వర్మ చాకచక్యంగా నాగుపామును డబ్బాలో బంధించాడు. పట్టుకున్న పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది చదవండి: కడప టూ బెంగళూరు.. ఇకపై 6 గంటల ప్రయాణం కాదు.. వివరాలు ఇవిగో.!

ఇది చదవండి:  మీరు తోపులని ఫీలవుతున్నారా.? దమ్ముంటే ఇందులో ‘B’ అక్షరాన్ని కనిపెట్టండి.!

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..