AP News: గుడి కడుతున్న వ్యక్తి.. గుప్త నిధుల కోసం తవ్వకాలు.. సీన్ కట్ చేస్తే

| Edited By: Ravi Kiran

Mar 18, 2025 | 8:11 PM

ఈజీ మనీ కోసం గుప్త నిధుల తవ్వకాలు జరపాలని అనుకున్నారు. ఆ నెపంతో ఒక అతడ్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత సీన్ కాస్తా సితారయ్యింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.

AP News: గుడి కడుతున్న వ్యక్తి.. గుప్త నిధుల కోసం తవ్వకాలు.. సీన్ కట్ చేస్తే
Representative Image
Follow us on

ఈజీగా మనీ సంపాదించడం కోసం ఓ ముఠా గుప్త నిధులు కోసం తవ్వకాలు చేయాలని ప్లాన్ చేసింది. గుప్త నిధులు తవ్వకాలు చేసేందుకు ఓ డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేసిందా ముఠా. పక్కా ప్రణాళికతో మడకశిర పోలీసులు గుప్తనిధుల తవ్వకాల ముఠా గుట్టు రట్టు చేసి.. కిడ్నాప్‌కు గురైన ఇద్దరిని కాపాడారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలానికి చెందిన మనోహర్ అనే వ్యక్తి కర్ణాటకలోని మధుగిరి తాలూకా పుట్టెనహళ్ళి గ్రామంలో అదృష్ట భైరవి అని గుడి నిర్మిస్తున్నాడు. మధుగిరి చెందిన సిద్ధగంగప్ప అనే వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడి.. ఈజీగా డబ్బు సంపాదించాలనుకుని ఒక ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపితే ఈజీగా డబ్బు సంపాదించవచ్చని.. పుట్టెనహళ్ళి గ్రామంలో అదృష్ట భైరవి గుడి కడుతున్న మనోహర్‌ను గుప్త నిధుల తవ్వకాల ముఠా సంప్రదించింది.

అయితే గుప్త నిధుల తవ్వకాలకు సహకరించాలని మనోహర్ చెప్పడంతో.. సిద్ధగంగప్ప ముఠా మనోహర్‌ను కిడ్నాప్ చేశారు. తుపాకులతో బెదిరించి మనోహర్‌ను చేతులు, కాళ్లు కట్టేసి బంధించారు. మనోహర్ దగ్గర అసిస్టెంట్‌గా ఉన్న రవి అనే అతన్ని బంగారం అమ్మి డబ్బులు తీసుకు రమ్మన్నారు సిద్ధ గంగప్ప ముఠా. బంగారం అమ్మి 11 లక్షలు సిద్ధగంగప్ప ముఠాకు ఇచ్చారు. అయితే ఆ డబ్బులు సరిపోకపోవడంతో.. ఇంకా ఐదు కోట్ల రూపాయల డబ్బులు కావాలని సిద్ధ గంగప్ప బెదిరించాడు. దీంతో మనోహర్ తన ఆస్తి అమ్మి నాలుగు రోజుల్లో డబ్బులు తీసుకుని వస్తారని కిడ్నాపర్ సిద్ద గంగప్పను నమ్మించి ఎలాగోలా బయటపడ్డాడు. కిడ్నాపర్ల చర నుంచి బయటపడ్డ మనోహర్ గుడిబండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయం అంతా పోలీసులకు వివరించాడు. దీంతో ఇంకా కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో ఇద్దరిని రక్షించేందుకు పోలీసులు పక్కా ప్రణాళిక రూపొందించారు. డబ్బులు తీసుకునేందుకు కిడ్నాపర్ ముఠాలో ప్రధాన నిందితుడు సిద్ధ గంగప్పను మడకశిర రప్పించాడు మనోహర్.

డబ్బుల కోసం మడకశిర వచ్చిన కిడ్నాపర్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కిడ్నాపర్ల దగ్గర ఉన్న మూడు తుపాకులతో పాటు రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల తవ్వకాల కోసం సహకరించలేదని ఏకంగా కిడ్నాప్ చేసి మనోహర్‌ను 5 కోట్లు డిమాండ్ చేయడంతో పాటు తుపాకులతో బెదిరించడంతో.. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని నిందితులను పట్టుకున్నారు.