Kamma Community: ‘కమ్మ సామాజిక వర్గంలో పేద, మధ్య తరగతి వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా నా వంతు కృషి చేస్తా’

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి ఛైర్మన్లను ప్రకటించారు. ఇవాళ విజయవాడలో ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌ ప్రమాణస్వీకార

Kamma Community: కమ్మ సామాజిక వర్గంలో పేద, మధ్య తరగతి వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా నా వంతు కృషి చేస్తా
Kamma Corp

Updated on: Aug 11, 2021 | 8:03 PM

Kamma Community: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి ఛైర్మన్లను ప్రకటించారు. ఇవాళ విజయవాడలో ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ దానేకుల కళ్యాణ మండపంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు హాజరై కార్పొరేషన్ ఛైర్మన్‌కు అభినందనలు తెలిపారు.

రాష్ట్రంలో కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరి అభివృద్ధి కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు తుమ్మల చంద్రశేఖర రావు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

కమ్మ సామాజిక వర్గంలో పేద మధ్యతరగతి వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ ప్రభుత్వం నుండి రావలసిన సంక్షేమ పథకాలు అందేలా తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఎం ఇచ్చిన అవకాశానికి వందశాతం న్యాయం చేస్తానని చంద్రశేఖర్ చెప్పారు.

Read also: ఇంద్రవెల్లి ఓ ఎత్తు, ఇబ్రహీంపట్నం మరో ఎత్తు.. నల్గొండ నాయకులు రేవంత్ రెడ్డి లైన్లోకి వస్తారా.!