అన్ని ఎలా ఎత్తుకెళ్లారా?.. మోస్ట్‌ వాంటెడ్‌ ముఠాకు చెక్‌ పెట్టిన పోలీసులు.. ఎక్కడో తెలుసా?

జిల్లాలో వరుస ఆటో, బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కాకినాడ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల నుంచి ఏకంగా రూ. 60 లక్షల విలువైన వాహనాలను రికవరీ చేశారు. నిందితులందిరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడిన వారంతా అదే జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

అన్ని ఎలా ఎత్తుకెళ్లారా?.. మోస్ట్‌ వాంటెడ్‌ ముఠాకు చెక్‌ పెట్టిన పోలీసులు.. ఎక్కడో తెలుసా?
Kakinada News

Updated on: Nov 08, 2025 | 9:59 PM

కాకినాడ జిల్లాలో వరుస ఆటోలు, మోటార్‌సైకిల్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు సంబందించిన మొత్తం ఐదుగురి సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.60 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడతో పాటు కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చోటుచేసుకున్న 40 వాహన దొంగతనాల కేసుల్లో 48 లక్షల విలువైన 18 ఆటోలు, 12 లక్షల విలువైన 22 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్‌ 7న విరవాడ సెంటర్‌ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని, దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపింపిచినట్టు పోలీసులు తెలిపారు.

పట్టుబడిన నిందితులు వీరే

  • పెమ్మాడి ఆశీర్వాదం (36), డ్రైవర్స్‌ కాలనీ, తూరంగి గ్రామం, కాకినాడ రూరల్‌. (పాత నేరస్తుడు)
  •  పెందుర్తి లోవరాజు (31), తూరంగి గ్రామం, కాకినాడ రూరల్‌.
  •  కొల్లి దుర్గాప్రసాద్‌  (34), గోలీలపేట, కాకినాడ.
  •  కాల కృష్ణ అర్జున్‌ (42), కరప గ్రామం, కాకినాడ రూరల్‌. (రిసీవర్‌)
  • కనుమూరి గణేష్‌ (44), జగన్నాధపురం కాకినాడ (రిసీవర్‌) వీరిని అరెస్ట్ చేశారు.

నిందితులు రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పార్క్‌ చేసిన ఆటోలు, బైకులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. హ్యాండిల్‌ లాక్‌ వేయని వాటిని త్రాడు సహాయంతో ఇంజిన్‌ వెనుక భాగం నుండి స్టార్ట్‌ చేసి తీసుకెళ్లేవారని. మోటార్‌సైకిళ్లును మారు తాళాలతో అన్‌లాక్ చేసి దొంగిలించేవారని తెలిపారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు పెమ్మాడి ఆశీర్వాదం పాత నేరస్తుడేనని ఎస్పీ తెలిపారు. ఇతనిపై గతంలో మూడు ఇంటి దొంగతనాల కేసులు నమోదయ్యాయని.. తన సహచరులు పెందుర్తి లోవరాజు, కొల్లి దుర్గాప్రసాద్‌ తదితరులతో కలిసి వాహనాలను దొంగిలించి, ఇంజిన్‌, చాసిస్‌ నంబర్లను మార్చి తక్కువ ధరలకు కాల కృష్ణ అర్జున్‌, కనుమూరి గణేష్‌లకు విక్రయించేవారని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.