JNTU: సరస్వతీ నిలయం విలాసాలకు అడ్డాగా మారింది. కాకినాడ JNTU గెస్ట్‌హౌస్ హనీమూన్ హబ్‌గా మారిపోయింది. యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌లో శోభనం తతంగం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ JNTU గెస్ట్‌హౌస్. అధికారులు, ప్రముఖుల విడిది కోసం ఈ గెస్ట్‌హౌజ్ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ జరుగుతుంది మాత్రం వేరు. గెస్ట్‌హౌస్ కాస్తా ఇప్పుడు విలాసాల హబ్‌గా మారిపోయింది.
గెస్ట్‌హౌస్‌ను హనీమూన్ కేంద్రంగా సిబ్బంది మార్చేశారనే ఆరోపణలు యూనివర్శిటీలో వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా శోభనం చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది యూనివర్సిటీ యాజమాన్యం. యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ స్వర్ణకుమారి పేరుపై రూమ్‌లు బుక్ చేశారు బంధువులు.
ఈనెల 18న ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ..స్వర్ణ కుమారి పేరిట JNTUKకు చెందిన గెస్ట్‌హౌస్‌లో మూడు రూములు బుక్ అయ్యాయి. బుక్‌చేసిన రూమ్ నంబర్ 201లో అట్టహాసంగా శోభనం ఏర్పాట్లు చేశారు. విషయం వెలుగులోకి రావడంతో ప్రముఖ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌ను ఇలాంటి పనులకు ఉపయోగించడంపై ఉద్యోగ, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
Read also: AP Weather Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు