Andhra: పొట్టకూటి కోసం వచ్చి ఇదేం పని.. ప్రాణం తీసిన పల్సర్ బైక్ దొంగతనం.. అసలేం జరిగిందంటే..

కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు వంతెన వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. పల్సర్ బైక్ దొంగతనం కేసులో యజమానికి చిక్కిన వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో వంతెనపై నుంచి దూకి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Andhra: పొట్టకూటి కోసం వచ్చి ఇదేం పని.. ప్రాణం తీసిన పల్సర్ బైక్ దొంగతనం.. అసలేం జరిగిందంటే..
Kadapa Tragedy

Edited By:

Updated on: Jul 30, 2026 | 4:43 PM

పొట్ట కూటికోసం ఊరుకాని ఊరు వచ్చిన ఓ వ్యక్తి.. తన యజమాని పల్సర్ బైక్ తీసుకెళ్లి తప్పించుకునే ప్రయత్నంలో విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు సమీపంలోని చెయ్యేరు వంతెన పై నుంచి దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కడప రాజారెడ్డి వీధికి చెందిన నూరుల్లా (45) గా గుర్తించారు. మృతుడు ఆరు నెలల క్రితం సిద్ధవటంలోని ఓ హోటల్లో పనిచేస్తూ ఓనర్ కృష్ణారెడ్డి పల్సర్ బైక్ తీసుకొని పరారీ అయ్యాడు. గత రెండురోజుల క్రితం కడపలోని ఓ దుకాణంలో పనిచేస్తూ మృతుడు ఓనర్ కృష్ణారెడ్డికి దొరికాడు. దొంగిలించిన బండి తిరుపతిలో ఉందని చెప్పడంతో కృష్ణారెడ్డి తన వాహనంలో తిరుపతికి నూరుళ్లను తీసుకువెళ్ళాడు.

ఈ క్రమంలోనే.. తిరుపతికి వెళ్లి బైక్ లేకపోవడంతో తిరిగి వస్తుండగా నూరుల్లా వారు ప్రయాణిస్తున్న వాహనం డోర్ తీసుకొని చెయ్యరు వంతెనపై నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వంతెన పై నుంచి దూకాడు.. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన కృష్ణారెడ్డి.. తీవ్ర గాయాలతో ఉన్న నూరుల్లాను రాజం పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే.. మార్గ మధ్యలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మన్నూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us