KA Paul: తెలుగువారి జీవితాలను నేను మాత్రమే మార్చగలను.. నన్ను గెలిపించండని కేఏ పాల్ విజ్ఞప్తి..

|

Apr 11, 2023 | 7:30 AM

సంచనాలకు కేరాఫ్ గా నిలుస్తారు కేఏ పాల్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. గల్లీ నుంచి అమెరికా అంశాలపై వరకు తనదైన శైలిలో స్పందిస్తుంటారు కేఏ పాల్. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేఏ పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ చేశారు. తాజాగా కాకరేపే కామెంట్స్‌తో మళ్లీ వార్తల్లోకెక్కారు కేఏ పాల్‌.

KA Paul: తెలుగువారి జీవితాలను నేను మాత్రమే మార్చగలను.. నన్ను గెలిపించండని కేఏ పాల్ విజ్ఞప్తి..
Ka Paul
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో మధ్య మధ్యలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేస్తున్న పంచ్ లు ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాయనే టాక్ ఉంది. తన మార్క్‌ డైలాగ్స్‌తో ఫన్‌ జనరేట్‌ చేసే పాల్‌… ఈసారి కాకరేపే కామెంట్స్‌తో మళ్లీ బ్రేకింగ్‌ న్యూస్‌ అయ్యారు.

సంచనాలకు కేరాఫ్ గా నిలుస్తారు కేఏ పాల్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. గల్లీ నుంచి అమెరికా అంశాలపై వరకు తనదైన శైలిలో స్పందిస్తుంటారు కేఏ పాల్. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేఏ పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ చేశారు. తాజాగా కాకరేపే కామెంట్స్‌తో మళ్లీ వార్తల్లోకెక్కారు కేఏ పాల్‌.

తనను టార్గెట్ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి లోకంలో లేకుండా పోయారని గతంలో కామెంట్ చేసిన పాల్‌… ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ట్రంప్ అరెస్ట్ అవుతాడని తాను గతంలోనే చెప్పానంటూ బాంబ్ పేల్చారు.

ఇవి కూడా చదవండి

అంతేనా మరో ఇంట్రస్టింగ్‌ రిక్వెస్ట్‌ చేశారు. అదేమంటే…. కేజ్రీవాల్‌ని ఢిల్లీలో, పంజాబ్‌లో ఎలా ఎన్నుకున్నారో.. తనని కూడా తెలుగు రాష్ట్రాల్లో అలాగే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్ని తానొక్కడే మార్చగలనని చెప్పుకొచ్చారు. అలాగే హిట్లర్‌ చనిపోయిన రోజున సచివాలయం ఎలా ప్రారంభిస్తారని.. తెలంగాణ తాజా రాజకీయాలపై స్పందించారు. కేఏపాల్‌ మార్క్‌ పాలిటిక్స్‌. ఏదేమైన సరే… ఉత్కపోతకు గురి చేసే రాజకీయ వేడిలో కూడా ఆయన ఏ మాత్రం తగ్గకుండా తన విన్యాసాలు చూపిస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..