Pawan Kalyan: వారాహిపై దూసుకు రాబోతున్న పవనుడు.. ఇకపై సుడిగాలిలా దూసుకుపోవడమే

|

Jun 02, 2023 | 5:32 PM

ఇప్పటి వరకు సంప్రదాయ రాజకీయ నేతలెవరికీ లేనివిధంగా సరికొత్త ఎన్నికల ప్రచార రథాన్ని పవన్ కళ్యాణ్ సిద్ధం చేయించిన విషయం తెలిసిందే. డిఫెన్స్ వాహనాన్ని పోలిన బస్సును రెడీ చేసుకున్నారు. త్వరలో ఈ వారాహి వాహనం ద్వారా సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు.

Pawan Kalyan: వారాహిపై దూసుకు రాబోతున్న పవనుడు.. ఇకపై సుడిగాలిలా దూసుకుపోవడమే
Pawan Kalyan
Follow us on

పవన్‌ కళ్యాణ్‌ ప్రచార రథ చక్రాల్‌ కదలబోతున్నాయి. తొలుత వాహనం కలర్‌మీద రచ్చయ్యింది. ఆ తర్వాత ముహూర్తబలం చూసుకుని తెలంగాణ కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు పూర్తయ్యాయి. ఇంకేముందీ ఆ భారీ బండి రోడ్డెక్కితే ఆ కిక్కే వేరనుకుంది కేడర్‌. ఎప్పుడు రోడ్డెక్కుతుందా అని అంతా వెయిటింగ్‌. కానీ ఆయన షూటింగుల్లో బిజీబిజీగా ఉంటే.. ప్రచార వాహనం రెస్ట్‌ తీసుకుంటోంది. మరి అధినేత ఆ బండి స్టీరింగ్‌ ఎప్పుడు తిప్పబోతున్నారు? అసలాయన రూట్‌మ్యాపేంటి?.. ఈ ప్రశ్నలకు క్లారిటీ వచ్చింది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రచారాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ త్వరలో చేపట్టబోయే వారాహి యాత్రపై మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తాజాగా చర్చించారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రచారానికి రూట్‌ మ్యాప్‌ని ఇప్పటికే సిద్ధం చేసింది జనసేన. ఈ నెల 14 నుంచి అన్నవరం నుంచి అమలాపురం వరకు పవన్ పర్యటన  ఉండనుంది. అన్నవరంలో సత్యదేవుణ్ణి దర్శించుకుని యాత్రను ప్రారంభించనున్నారు పవన్. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనాని తొలి విడత ప్రచారం ఉంటుంది. పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం, పాలకొల్లు, భీమవరంలలో పవన్ పర్యటన ఉంటుంది. పలు ప్రధాన కూడళ్లు, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసే సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.

వారాహి.. ప్రచారం కోసం పవవ్ కల్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వాహనం ఇది. పవన్ కల్యాణ్ గత రోడ్ షోలను దృష్టిలో పెట్టుకొని వాహనాన్ని పత్యేకంగా తయారు చేయించింది జనసేన పార్టీ. త్వరలోనే ఈ వెహికల్‌పై జనసేన అధినేత పర్యటనలు ఉండబోతున్నాయి. సహజంగా వీఐపీలు వాడే కేర్‌వాన్‌ని ఎలక్షన్‌ క్యాంపెయినింగ్‌కి తన టేస్ట్‌గా తగ్గట్లుగా మలచుకున్నారు పవన్ కల్యాణ్‌. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. యుద్దంలో నలు దిక్కుల నుంచి కాపాడే వారాహి అమ్మవారి పేరును తన ఎన్నికల ప్రచార రథానికి స్వయంగా నామకరణం చేశారు పవన్ కల్యాణ్‌.

వారాహి వాహనం చుట్టూ ప్రత్యేక లైటింగ్ తో పాటు వెరీ హైఎండ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఫిట్ చేశారు. సభల్లో పవన్ ప్రసంగం స్పష్టంగా వినిపించేలా లేటెస్ట్ సౌండ్ సిస్టం, వాహనం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్‌కి రియల్ టైంలో వెళ్లేలా ప్రజెంట్ టెక్నాలజీతో ఉపయోగించారు. వాహనం లోపల పవన్ కల్యాణ్ తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా.. అలాగే హైడ్రాలిక్ లిప్ట్ ద్వారా పవన్ వాహనం పైకి చేరుకునేలా సిస్టం అమర్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి