Andhra Pradesh: కర్నూలు జిల్లాలో దారుణం.. జర్నలిస్టు దారుణ హత్య.. అసలు కారణం అదేనా..?

| Edited By: Ravi Kiran

Aug 10, 2021 | 8:16 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమాలు వెలుగుతీశాడనే అక్కసుతో

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో దారుణం.. జర్నలిస్టు దారుణ హత్య.. అసలు కారణం అదేనా..?
Journalist
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమాలు వెలుగుతీశాడనే అక్కసుతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అతన్ని చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు, కేశవ స్నేహితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాలలో వి5 అనే యూట్యూబ్ ఛానల్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడు కేశవ. అయితే, నంద్యాలకు చెందిన ఓ కానిస్టేబుల్‌ దురాగతాలపై తన యూట్యూబ్ ఛానల్‌లో కేశవ వార్తలు రాశాడు. ఈ వార్తల ఆధారంగానే సదరు కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. దాంతో కేశవపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో కేశవ ఎన్జీవో కాలనీలో హాస్టల్ దగ్గర ఉండగా.. సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్, అతని సోదరుడు ఇద్దరూ కలిసి స్క్రూడ్రైవర్‌తో కేశవ కడుపులో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన కేశవను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేశవను చంపింది.. కానిస్టుబులే అని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కేశవ స్నేహితులు. కాగా, కేశవ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తు్న్నారు. ఈ కేసుపై ఏకంగా జిల్లా ఎస్పీ ఫోకస్ పెట్టారు.

Also read:

YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..

Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం కీలక మార్గదర్శకాలు.. ఇకపై విదేశీ జాతీయులకు టీకాలు

Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..