Srikakulam: యువతకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కావాలన్నా మాజీ జేడీ లక్ష్మీనారాయణ

|

Mar 02, 2023 | 7:46 AM

ప్రభుత్వ , ప్రైవేటు రెండు రంగాల్లోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరగాలన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం రంగాలలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

Srikakulam: యువతకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కావాలన్నా మాజీ జేడీ లక్ష్మీనారాయణ
Jd Lakshminarayana
Follow us on

యువతకు ఉద్యోగాలు కల్పనను ప్రభుత్వాలు మొదట ప్రాధాన్యతగా తీసుకొని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ. దేశంలో చాలా కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయని ప్రతి ఏట చాలామంది పట్టభద్రులు బయటకి వస్తున్న ఆ మేరకు వాళ్ళకి ఉద్యోగాలు దొరకటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ , ప్రైవేటు రెండు రంగాల్లోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరగాలన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం రంగాలలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం DSC తో పాటు మిగిలిన ఉద్యోగాలు భర్తీకి సంబంధించి త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారని అలా అయితే ఎక్కువ ఉద్యోగాలు కల్పనకు అవకాశముంటుందన్నారు. శ్రీకాకుళంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా యువత తో జేడీ లక్ష్మీనారాయణ కొంచెం సేపు సంభాషించారు. యువత సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Reporter:- S.Srinivas

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..