Varahi Yatra: ‘ఇది ఉప్మా ప్రభుత్వం’.. వైసీపీ సర్కార్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

|

Jun 21, 2023 | 9:07 PM

Pawan Kalyan- Janasena: ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం జగన్ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. తన వారాహి యాత్రలో భాగంగా బుధవారం కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో..

Varahi Yatra: ‘ఇది ఉప్మా ప్రభుత్వం’.. వైసీపీ సర్కార్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
Janasenani Pawan Kalyan Varahi Yatra in Konaseema
Follow us on

Pawan Kalyan- Janasena: ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం జగన్ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. తన వారాహి యాత్రలో భాగంగా బుధవారం కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ మాట్లాడుతూ ‘‘వంద మంది కష్టాన్ని 30 మందికి పంచుతున్నాడు. వైసీసీ ఉప్మా ప్రభుత్వం. రాష్ట్రంలోని 75 శాతం మంది వైసీపీపై అయిష్టంగా ఉన్నారు. ఆ 75 శాతం మంది ఏకాభిప్రాయానికి వచ్చి, అనైక్యతను జయించాలి. ఉమ్మడి కార్యాచరణను అర్థం చేసుకోవాలి. నా దగ్గర వేల కోట్లు లేవు, సుఫారీ గ్యాంగుల్లేవు, క్రిమినల్స్‌ లేరు’’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ‘‘కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడం నాకు అభ్యంతరం లేదు. కానీ జనం ఏమనుకుంటున్నారో కూడా ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇక్కడ పండించిన ప్రతి బస్తా ద్వారంపూడి కుటుంబానికి వెళుతోంది. నేను వైసీపీకి వ్యతిరేకం కాదు. రైతు కన్నీరు తుడుస్తానంటే.. నేను చప్పట్టు కొడతా తప్ప వ్యతిరేకించను. కానీ లక్షల మంది రైతులు కన్నీరు పెడుతున్నారు. కోనసీమ రైతుల కన్నీటి మీద సంపాదించుకుంటోంది ద్వారంపూడి కుటుంబం. ఒక కులమే… రెండు కులాలే మొత్తం ఆర్థిక వ్యవస్థని చేతిలో పెట్టుకోవాలంటే కుదరదు. అందరూ పైకి రావాలి’’ అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఓడిపోతానని తెలిసే వైసీపీతో పెట్టుకుంటున్నానని, తన తల్లి వారాహి తనకు రక్షణ అని, కేసులున్నవాడు రైతాంగం తరఫున ఎలా పోరాటం చేస్తాడని, తాను ఓడిపోతే ప్రజలే నష్టపోతారని అన్నారు. ‘‘తెలంగాణలో మనల్ని ఆంధ్రా కొడుకులు దోచేశారని కొట్టితిట్టి తరిమేశారు. తెలంగాణ అంటే నాకు ప్రేమ ఉంది.. కానీ వారి నాయకులు మనల్ని తన్ని తగలేశారు. అన్ని కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారు. మనం విభిన్న కులాలం.. కానీ ‘మనం ఆంధ్రులం’ అన్న భావన లేకపోతే నష్టం. ఇసుకంతా ఒకరు, రైస్‌ అంతా ఒక కుటుంబం దోచేస్తోంది. లక్షల మంది కష్టాన్ని కొద్ది మంది దోచుకుంటే నేను ప్రతిఘటిస్తాను. చేగువేరా స్ఫూర్తితో దోపిడీ వ్యవస్థపై జనసేన పోరాటం చేస్తుంది’ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..